logo

ఆయిల్‌పాం సాగుతో అధిక లాభాలు

రైతులు సాధారణ పంటలను వదిలేసి, ఆయిల్‌ పాం సాగు చేసుకోవడం ద్వారా అధిక లాభాలు పొందవచ్చని నారాయణపేట జిల్లా ఆయిల్‌ఫెడ్‌ ఇన్‌ఛార్జి మేనేజర్‌ సత్యనారాయణ అన్నారు.

Published : 21 Mar 2023 02:07 IST

కన్మనూర్‌లో రైతులకు మొక్కలు అందజేస్తున్న సత్యనారాయణ

మరికల్‌, న్యూస్‌టుడే : రైతులు సాధారణ పంటలను వదిలేసి, ఆయిల్‌ పాం సాగు చేసుకోవడం ద్వారా అధిక లాభాలు పొందవచ్చని నారాయణపేట జిల్లా ఆయిల్‌ఫెడ్‌ ఇన్‌ఛార్జి మేనేజర్‌ సత్యనారాయణ అన్నారు. మరికల్‌ మండలం కన్మనూర్‌ గ్రామంలో నర్సరీలో పెంచుతున్న ఆయిల్‌ పాం మొక్కలను సోమవారం పరిశీలించారు. వివిధ గ్రామాల రైతులకు వాటిని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నారాయణపేట జిల్లా మొత్తంలో మూడు వేల ఎకరాల విస్తీర్ణంలో రైతుల చేత ఆయిల్‌ పాం సాగు చేయించాలని లక్ష్యంగా పెట్టుకొన్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు 685 మంది రైతుల ద్వారా 2,600 ఎకరాల విస్తీర్ణంలో సాగు చేయించినట్లు తెలిపారు. ఎకరాకు 57 మొక్కల చొప్పున రైతులకు ఆయిల్‌ పాం మొక్కలు అందిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 8 జిల్లాల్లో ఈ నెలాఖరు నాటికి 45 వేల ఎకరాల విస్తీర్ణంలో ఈ తోటలను సాగు చేయించాలన్న లక్ష్యంతో ఆయిల్‌ ఫెడ్‌ సంస్థ కృషి చేస్తోందన్నారు. ఆయిల్‌ పాం మొక్కలు నాటిన అయిదేళ్లకు దిగుబడి మొదలవుతుందని, ఏడాదికి సుమారు ఎనిమిది నుంచి పది టన్నుల దిగుబడి వస్తుందని చెప్పారు. కార్యక్రమంలో డీహెచ్‌ఎస్‌వో కస్తూరి, సిబ్బంది ఫయాజ్‌, కిశోర్‌, మోహన్‌రావు, మేఘన, విజయశ్రీ,   రైతులు దామోదర్‌రెడ్డి, నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని