logo

గుర్తుండిపోయే పనులు చేశాం

నియోజకవర్గంలో ఏళ్ల తరబడి గుర్తుండిపోయే అభివృద్ధి పనులు చేశామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు.

Published : 21 Mar 2023 02:11 IST

మంత్రి నిరంజన్‌రెడ్డి

ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడుతున్న మంత్రి నిరంజన్‌రెడ్డి

పెద్దమందడి, న్యూస్‌టుడే: నియోజకవర్గంలో ఏళ్ల తరబడి గుర్తుండిపోయే అభివృద్ధి పనులు చేశామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని వెల్టూరు గోపాలసముద్రం చెరువు వద్ద నిర్వహించిన భారాస ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. సుమారు 700 ఏళ్ల కిందట రాజులు నిర్మించిన ఖిల్లాగణపురంలోని గణపసముద్రం, వెల్టూరులోని గోపాలసముద్రం చెరువులను పునరుద్ధరిస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్‌ సహకారంతో శాశ్వతంగా నిలిచిపోయే అభివృద్ధి పనులు చేశామని, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షునిగా నియోజకవర్గంలో 70 వేల ఎకరాలకు సాగునీరు ఇచ్చాకే 2018లో నామినేషను వేశానన్నారు. పెద్దఎత్తున చెక్‌డ్యామ్‌లు నిర్మించామని, గ్రామాలు, తండాలకు సీసీ, బీటీ రహదారులు నిర్మించామని, రాష్ట్రంలో అత్యధికంగా సీసీ రహదారులు వేసిన నియోజకవర్గం వనపర్తేనని పేర్కొన్నారు. ఇన్ని చేసినా   విపక్షాలు విమర్శిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తంచేస్తూ.. ఖబడ్దార్‌ అని హెచ్చరించారు. కానాయపల్లి నుంచి పెద్దమందడి చెరువుకు ఎత్తిపోతల ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. పార్టీ నియోజకవర్గ బాధ్యుడు రవిందర్‌రావు మాట్లాడుతూ దేశంలో ఇంత అభివృద్ధి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆరేనని పేర్కొన్నారు. ఈ సమ్మేళనంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్‌, జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షుడు జగదీశ్వర్‌రెడ్డి, వనపర్తి మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ పలుస రమేష్‌గౌడ్‌, మండల పార్టీ అధ్యక్షుడు వేణుయాదవ్‌, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని