logo

చిరుత సంచారంపై కలకలం

కోడేరు మండలంలోని పసుపుల గట్టుపై చిరుత పులి సంచరిస్తుందనే ప్రచారం సోమవారం స్థానికంగా కలకలం రేపింది.

Published : 21 Mar 2023 02:11 IST

కళేబరాన్ని పరిశీలిస్తున్న అటవీ అధికారి

కోడేరు, పెద్దకొత్తపల్లి, న్యూస్‌టుడే: కోడేరు మండలంలోని పసుపుల గట్టుపై చిరుత పులి సంచరిస్తుందనే ప్రచారం సోమవారం స్థానికంగా కలకలం రేపింది. మేకల కాపరి, గ్రామస్థుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. మండలంలోని పసుపుల గ్రామ శివారులోని గట్టు ఉంది. కోడేరు, పెద్దకొత్తపల్లి మండలాల మధ్య మొత్తం అటవీ ప్రాంతం పరిధిలో ఈ గట్టు ఉంది. రోజువారీగా సొప్పరి అర్జునయ్య, అతని భార్య కలిసి వారికున్న 25 మేకలను గట్టుపైకి మేతకు తీసుకెళ్లారు. ఆదివారం సాయంత్రం మేకల మందును ఇంటికి తీసుకొస్తుండగా పెద్దలొంక సమీపంలో చిరుత దాడి చేసి మందలోని ఒక మేకపోతును మాయం చేసింది. పెద్ద బండరాయి మధ్యలో కొంత దూరం తీసుకెళ్లి మేకను తినేసిన ఆనవాళ్లున్నాయి. సోమవారం గ్రామస్థుల ద్వారా లింగాల రేంజ్‌ పరిధిలోని సెక్షన్‌ అధికారి వెంకటయ్య, బీట్‌ అధికారి నాగార్జున్‌గౌడ్‌ ఘటనా స్థలం వద్దకు వెళ్లి పరిశీలించారు. అక్కడ మేకపోతును తిని వదిలేసిన ఆనవాళ్లు ఉన్నాయి. చిరుత ఇలా దాడి చేయదని అక్కడున్న పాదాల ముద్రలు పరిశీలించిన అటవీ అధికారులు రేస్‌కుక్కలు ఉన్నాయని అవే దాడి చేసి ఉండవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని