logo

‘ధరణి’పైనే ఫిర్యాదులు

కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణికి సోమవారం ధరణి సమస్యలపై అధికంగా ఫిర్యాదులొచ్చాయి.

Published : 21 Mar 2023 02:11 IST

ఫిర్యాదులు స్వీకరిస్తున్న డీఆర్‌డీవో నర్సింగరావు

నాగర్‌కర్నూల్‌, న్యూస్‌టుడే: కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణికి సోమవారం ధరణి సమస్యలపై అధికంగా ఫిర్యాదులొచ్చాయి. ప్రజావాణికి కలెక్టర్‌ హాజరు కాకపోవడంతో కొంతమంది వినతులు ఇవ్వకుండానే వెళ్లిపోయారు. ప్రతి సోమవారం ప్రజావాణిలో ధరణికి సంబంధించిన సమస్యలు కొన్ని పరిష్కారం అవుతున్నాయి. పెండింగ్‌లో ఉన్న పాసుపుస్తకాలు, వివిధ శాఖల వద్ద పెండింగ్‌లో ఉన్నవి అక్కడిక్కక్కడే పరిష్కరిస్తున్నారు. ప్రజావాణిలో డీఆర్‌డీవో నర్సింగరావు, సీపీవో భూపాల్‌రెడ్డి ఫిర్యాదులు స్వీకరించారు. భూముల సమస్య ఉన్నవారు వెనక్కి వెళ్లిపోయారు. దూర ప్రాంతాల నుంచి ఇబ్బందులు పడ్డామన్నారు. 

కలెక్టర్‌ కోసం ఎదురు చుస్తున్న ఫిర్యాదుదారులు..


* లింగాల వద్ద మాకు రెండెకరాల భూమి ఉంది. ధరణిలో నమోదు కాలేదు. తహసీల్దార్‌, ఆర్డీవో, కలెక్టరేట్‌ చుట్టూ తిరిగి అలసిపోతున్నాం. మాకు కూలి పని చేసుకుంటేనే జీవనం గడుస్తుంది. కలెక్టరేట్‌లోని ప్రజావాణిలో ఫిర్యాదు చేస్తే తహసీల్దార్‌ కార్యాలయానికి వెళ్లాలని చెప్పారు. అక్కడ తాము దస్త్రాలు ఆర్డీవో కార్యాలయానికి పంపించమన్నారు. ఆర్డీవో దగ్గరికి వెళ్తే మాకు ఇంకా రాలేదు తహసీల్దార్‌ కార్యాలయానికే వెళ్లాలని చెబుతున్నారు. తాము ఎన్ని సార్లు ఎక్కడికని తిరగాలి. ధరణిలో నా భూమిని నమోదు చేయించి న్యాయం చేయండి.

లింగమ్మ, లింగాల


* చారగొండలో జాతీయ రహదారి-167కి సంబంధించి రోడ్డు విస్తరణ పనులు చేపట్టారు. బైపాస్‌ రోడ్డుతో 30 ఇళ్లు, 35 ప్లాట్లు, వ్యవసాయ భూములను కోల్పోతున్నాం. అధికారులు తక్కువగా నష్టపరిహారం చెల్లిస్తున్నారు. అధికారులు, స్థానిక నాయకులు కుమ్మకై కొంతమందికి ఎక్కువ పరిహారం ఇస్తున్నారు. అందరికి ఒకే న్యాయం జరిగేలా చూడాలి. పూర్తిస్థాయిలో విచారణ జరిపి నష్టపోతున్న లబ్ధిదారులకు న్యాయం చేయాలి.

చారగొండ గ్రామస్థులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని