logo

గొలుసు చోరీల కలకలం

సాయంత్రపు నడకకు వచ్చిన ఓ మహిళ మెడలో నుంచి బంగారు పుస్తెలతాడును గుర్తు తెలియని ఇద్దరు యువకులు అపహరించిన ఘటన జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది.

Published : 24 Mar 2023 05:03 IST

మహబూబ్‌నగర్‌ నేరవిభాగం, న్యూస్‌టుడే : సాయంత్రపు నడకకు వచ్చిన ఓ మహిళ మెడలో నుంచి బంగారు పుస్తెలతాడును గుర్తు తెలియని ఇద్దరు యువకులు అపహరించిన ఘటన జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. గ్రామీణ ఠాణా ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం మహబూబ్‌నగర్‌ పట్టణంలోని శ్రీనివాసకాలనీకి చెందిన మల్లు ప్రమీలమ్మ గురువారం సాయంత్రపు నడకకు ఆ కాలనీలోని పార్కు వద్దకు వచ్చారు. అనంతరం పార్కు నుంచి బయటకు వస్తున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు తలకు మాస్కులు పెట్టుకుని ద్విచక్రవాహనంపై వచ్చి మైసమ్మ గుడి వద్ద ఆమె మెడలోని మూడు తులాల పుస్తెల తాడును లాక్కొని వెళ్లిపోయారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న ఎస్పీ నరసింహ ఘటనా స్థలానికి వచ్చి బాధితురాలితో మాట్లాడారు. దొంగతనం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు.

జడ్చర్లగ్రామీణం, న్యూస్‌టుడే : నడుచుకుంటూ ఇంటికెళ్తున్న మహిళ మెడలోంచి మంగళసూత్రం అపహరించిన ఘటన జడ్చర్లలో గురువారం చోటు చేసుకుంది. బాధితురాలు, సీఐ రమేశ్‌బాబు వివరాల ప్రకారం.. పట్టణంలోని గంజ్‌ సమీపంలోని రాంమందిర్‌ వద్ద ప్రైవేటు ఫైనాన్స్‌లో శ్రీలత అనే మహిళ పని చేస్తుంది. విధులు ముగించుకుని ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్న క్రమంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ద్విచక్రవాహనంపై హెల్మెట్‌లు ధరించి ఆమె మెడలోంచి మూడు తులాల మంగళసూత్రాన్ని లాక్కొని పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు సీఐ తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని