గ్రామ పంచాయతీలకు జాతీయ పురస్కారాలు
గద్వాలలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గురువారం జడ్పీ వైస్ ఛైర్‌పర్సన్ సరోజమ్మ, ఎంపీపీ ప్రతాప్‌గౌడ్, ఎంపీడీవో రవీంద్ర సమక్షంలో జాతీయ పంచాయతీ అవార్డ్స్ పురస్కార కార్యక్రమాన్ని నిర్వహించారు.
గద్వాల ఎంపీడీవో కార్యాలయం వద్ద ప్రశంసాపత్రాలతో పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు
గద్వాల గ్రామీణం, న్యూస్‌టుడే : గద్వాలలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గురువారం జడ్పీ వైస్ ఛైర్‌పర్సన్ సరోజమ్మ, ఎంపీపీ ప్రతాప్‌గౌడ్, ఎంపీడీవో రవీంద్ర సమక్షంలో జాతీయ పంచాయతీ అవార్డ్స్ పురస్కార కార్యక్రమాన్ని నిర్వహించారు. పేదరికం లేని గ్రామం, మెరుగైన జీవనోపాధి, ఆరోగ్యవంతమైన, చైల్డ్ ఫ్రెండ్లీ విలేజ్, నీరు సరిపోయే గ్రామం, క్లీన్ అండ్ గ్రీన్, స్వయం సమృద్ధితో కూడిన గ్రామం, సామాజికంగా, న్యాయంగా సురక్షితం, గుడ్ గవర్నెన్స్, మహిళా స్నేహపూర్వక గ్రామం వంటి 9 అంశాలపై గ్రామ పంచాయతీలకు సంబంధించి సర్పంచులు, కార్యదర్శులకు ప్రశంసాపత్రాలను అందజేసి శాలువాలతో సత్కరించారు. మండలంలోని కొత్తపల్లి, వీరాపురం, పుటాన్‌పల్లి, పూడూరు, ఈడిగోనిపల్లి, రేకులపల్లి, మదనపల్లి, చెనుగోనిపల్లి, సంగాల, కుర్వపల్లి, గుంటిపల్లి, ముల్కలపల్లి, జిల్లెడబండ, తెలుగోనిపల్లి వంటి 14 గ్రామ పంచాయతీలు పురస్కారాలు అందుకున్నాయి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
నయన చిత్రం.. ప్రతీకార నేపథ్యం
-
Ap-top-news News
శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు
-
Sports News
బ్యాటింగ్ ఎంచుకోవాల్సింది: మాజీ కోచ్ రవిశాస్త్రి
-
World News
భారతీయులకు వీసాల మంజూరులో జాప్యమేల?
-
Crime News
ప్రియుడి మర్మాంగం కోసిన యువతి
-
Ts-top-news News
భారత్‌లో మహిళలకు బైపాస్ సర్జరీ అనంతర ముప్పు తక్కువే!