logo

20 ఏళ్లుగా బదిలీలేవీ?

దేవాదాయ, ధర్మాదాయశాఖలో బదిలీల పర్వం పూర్తిగా నిలిచిపోయింది. సుమారు 20 ఏళ్లపైబడి నుంచి ఎక్కడివారు అక్కడే పాతుకుపోయారు.

Published : 24 Mar 2023 05:29 IST

దేవాదాయశాఖలో నిలిచిన ప్రక్రియ

మన్యంకొండ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం

మహబూబ్‌నగర్‌ సాంస్కృతికం, న్యూస్‌టుడే: దేవాదాయ, ధర్మాదాయశాఖలో బదిలీల పర్వం పూర్తిగా నిలిచిపోయింది. సుమారు 20 ఏళ్లపైబడి నుంచి ఎక్కడివారు అక్కడే పాతుకుపోయారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం మూడేళ్లకోసారి బదిలీల ప్రకియ జరగాల్సి ఉన్నా.. ఆ మేరకు చర్యలు చేపట్టడం లేదు. దీంతో విధి నిర్వహణలో పారదర్శకత కొరవడటమే కాకుండా శాఖాపరంగా ఉద్యోగులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా దేవాదాయశాఖ పరిధిలో మొత్తం 1,340 పైబడి దేవాలయాలున్నాయి. వీటిలో పేరుగాంచినవి 6ఎ, బి, సి విభాగాల్లో కొనసాగుతున్నాయి. శాఖాపరంగా సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. ఉద్యోగ నియామకాలు  చేపట్టకపోవటంతో ఉన్నవారే అదనపు బాధ్యతల్లో కొనసాగుతున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా చిన్న, పెద్ద ఆలయాల్లో అన్ని విభాగాల్లో సుమారు 500పైబడి ఉద్యోగులు, సిబ్బంది పని చేస్తున్నారు. వీరిలో కొందరు ఇతర వ్యాపారాలకూ పూనుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. టికెట్ల విక్రయాల్లో అక్రమాలకు పాల్పడుతున్నారని, బ్రహ్మోత్సవాల సమయంలో కొబ్బకాయలు, తలనీలాలు తదితర టెండర్లు వీరి కనుసన్నల్లో కొనసాగుతున్నాయనే విమర్శలున్నాయి. ఈ విషయమై దేవాదాయశాఖ ఉమ్మడి జిల్లా సహాయ కమిషనర్‌ జి.శ్రీనివాసరాజును సంప్రదించగా ‘ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా ప్రతీ మూడేళ్లకోసారి బదిలీలు జరిగితేనే పనితీరులో పారదర్శకత పెరుగుతుంది. అభివృద్ధిపై దృష్టిపెడతారు. బదిలీల విషయమై జిల్లా ఉద్యోగుల నుంచి వినతి వస్తే రాష్ట్ర కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్తాం’ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని