logo

ఆర్థికంగా అభివృద్ధి చెందితేనే కులవ్యవస్థ నిర్మూలన

దళితులు ఆర్థికంగా అభివృద్ధి చెందితేనే కులవ్యవస్థ నిర్మూలన సాధ్యమని రాష్ట్ర ఎక్సైజ్‌ క్రీడలశాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు.

Published : 24 Mar 2023 05:38 IST

అంబేడ్కర్‌ చిత్రపటం వద్ద జ్యోతి వెలిగిస్తున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తదితరులు..

మహబూబ్‌నగర్‌ విద్యావిభాగం, న్యూస్‌టుడే : దళితులు ఆర్థికంగా అభివృద్ధి చెందితేనే కులవ్యవస్థ నిర్మూలన సాధ్యమని రాష్ట్ర ఎక్సైజ్‌ క్రీడలశాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. గురువారం మహబూబ్‌నగర్‌ పట్టణంలో ‘ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఇండస్ట్రీలో ఎస్సీ, ఎస్టీలకు వ్యాపార అవకాశాలు’ అనే అంశంపై డిక్కీ ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి అవగాహన సదస్సుకు జడ్చర్ల ఎమ్మెల్యే డా.సి.లక్ష్మారెడ్డితో కలిసి హాజరై మాట్లాడారు. బహుజనులు యాచకులుగా కాకుండా శాసించేవారిగా ఎదగాలన్నదే అంబేడ్కర్‌ ఆశయమన్నారు. ఆయన స్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వం దళిత సాధికారితకు కృషి చేస్తోందన్నారు. దళిత, గిరిజనులను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడానికి డిక్కీ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఎమ్మెల్యే డా.సి.లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఆత్మన్యూనతాభావం వదిలి అందరితో కలిసి పని చేయాలని సూచించారు. ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డి, జడ్పీ వైస్‌ఛైర్మన్‌ యాదయ్య, డిక్కీ జాతీయ అధ్యక్షుడు పద్మశ్రీ నర్రా రవికుమార్‌, రాష్ట్ర అధ్యక్షురాలు అరుణ, మాజీ అధ్యక్షుడు కె.రవికుమార్‌, సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రణీల్‌ చందర్‌ తదితరులు పాల్గొన్నారు.

సదస్సుకు హాజరైన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, యువకులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని