logo

వైభవంగా రాష్ట్ర స్థాయి కవి సమ్మేళనం

కవులు, కళాకారులే తెలంగాణ ప్రాంతానికి పట్టుకొమ్మలని తెలంగాణ సాహతీ అకాడమీ పూర్వ ఛైర్మన్‌ నందిని సిధారెడ్డి అన్నారు.

Published : 27 Mar 2023 04:49 IST

కార్యక్రమంలో మాట్లాడుతున్న నందిని సిధారెడ్డి

బిజినేపల్లి, న్యూస్‌టుడే : కవులు, కళాకారులే తెలంగాణ ప్రాంతానికి పట్టుకొమ్మలని తెలంగాణ సాహతీ అకాడమీ పూర్వ ఛైర్మన్‌ నందిని సిధారెడ్డి అన్నారు. ఆదివారం బిజినేపల్లి మండలం పాలెంలోని శ్రీ వేంకటేశ్వర ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రాష్ట్ర స్థాయి కవి సమ్మేళనం నిర్వహించగా, నందిని సిధారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మట్లాడారు. రాష్ట్రంలోని 110 మంది కవులు హాజరై ప్రావిణ్యాన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా పాలమూరుకు చెందిన ప్రముఖ కవి కపిలవాయి లింగమూర్తి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. నందిని సిధారెడ్డి మాట్లాడుతూ.. పాలెం శ్రీ వేంకటేశ్వర డిగ్రీ కళాశాలలో 60 ఏళ్లుగా వేలాది మంది విద్యార్థులు విధ్యను అభ్యసించి ఉన్నత స్థానాల్లో నిలిచారన్నారు. తెలుగు బాషా ఛైతన్య సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బడేసాబ్‌ మాట్లాడుతూ.. పాలెం కళాశాల పూర్వ విద్యార్థులు ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఉన్నత స్థాయిలో స్థిరపడ్డారని, ఈతరం యువత క్రమశిక్షణతో విద్యనభ్యసించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాక్షించారు. అనంతరం విశ్రాంత బాషోపాధ్యాయులు యం.డి జహంగీర్‌కు ఉగాది పురస్కారం అందజేశారు. కార్యక్రమంలో విశ్రాంత డీఈవో శివార్చక విజయ్‌కుమార్‌, కళాశాల ప్రిన్సిపల్‌ మల్లిఖార్జున్‌, గాడి సురేందర్‌, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని