logo

‘పాలమూరు - రంగారెడ్డి’తో వలసలకు అడ్డుకట్ట

పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నిర్మాణంతో ఉమ్మడి మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి జిల్లాల్లో వలసలకు అడ్డుకట్ట పడనుందని చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి అన్నారు.

Published : 27 Mar 2023 04:49 IST

చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి

కర్వెన జలాశయం వద్ద మాట్లాడుతున్న ఎంపీ రంజిత్‌రెడ్డి, చిత్రంలో ఎమ్మెల్యేలు మహేశ్‌రెడ్డి, మెతుకు ఆనంద్‌

బిజినేపల్లి, భూత్పూర్‌, తిమ్మాజిపేట, న్యూస్‌టుడే : పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నిర్మాణంతో ఉమ్మడి మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి జిల్లాల్లో వలసలకు అడ్డుకట్ట పడనుందని చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి అన్నారు. ఆదివారం నాగర్‌కర్నూల్‌ జిల్లా బిజినేపల్లి, తిమ్మాజిపేట మండలాల పరిధిలోని వట్టెం వెంకటాద్రి జలాశయం, నాగర్‌కర్నూల్‌ సమీపంలోని కుమ్మెర దగ్గర టన్నెల్‌ పనులు, మహబూబ్‌నగర్‌ జిల్లా భూత్పూరు మండలంలో కర్వెన జలాశయాన్ని పరిగి, వికారాబాద్‌ ఎమ్మెల్యేలు మహేశ్వర్‌రెడ్డి, మెతుకు ఆనంద్‌, ప్రజాప్రతినిధుల బృందంతో కలిసి ఆయన పరిశీలించారు. ప్రాజెక్టు నిర్మాణం, నీటి నిల్వ సామర్థ్యం వివరాలను ఇంజినీరింగ్‌ అధికారులు వివరించారు. ఎంపీ రంజిత్‌కుమార్‌ మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ రైతులు, వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తూ రైతుబీమా, రైతుబంధు వంటి పథకాలను అమలుచేశారని గుర్తుచేశారు. పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు 80 శాతం జరిగాయని, నిర్మాణం పూర్తయితే సాగు, తాగునీటి సమస్యలు దూరమవుతాయని పేర్కొన్నారు. భారాస ప్రభుత్వానికి రాష్ట్రంలో, దేశంలో లభిస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఎస్‌ఈ చక్రధరం, ఈఈ దయానంద్‌, డీఈఈలు విజయేందర్‌, ప్రభాకర్‌రెడ్డి, అబు సిద్ధిఖ్‌, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎంపీపీలు, జడ్పీటీసీ సభ్యులు, భారాస నేతలు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు