కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు వేళాయె!
అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్య అందిస్తూ విద్యార్థులను విభిన్న అంశాల్లో తీర్చిదిద్దే వేదికలుగా కేంద్రీయ విద్యాలయాలు నిలుస్తున్నాయి.
మహబూబ్‌నగర్ : ఏనుగొండలోని కేంద్రీయ విద్యాలయం
న్యూస్‌టుడే, మహబూబ్‌నగర్ విద్యావిభాగం: అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్య అందిస్తూ విద్యార్థులను విభిన్న అంశాల్లో తీర్చిదిద్దే వేదికలుగా కేంద్రీయ విద్యాలయాలు నిలుస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఒక్కటే విద్యాలయం ఉంది. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ విద్యాలయంలో ఒకటో తరగతి ప్రవేశాలకు ఇటీవల నోటిఫికేషన్ విడుదలైంది. కేంద్రీయ విద్యాలయంలో సీబీఎస్‌ఈ సిలబస్ ఉంటుంది. ప్రయోగాత్మక పద్ధతిలో గుణాత్మక విద్య అందిస్తారు. క్రీడలు, యోగా, స్కౌట్స్, ఎన్‌సీసీల్లో విద్యార్థులను ప్రోత్సహిస్తారు. ఇందులో చదివే విద్యార్థులు పోటీ ప్రపంచంలో రాణించేందుకు అవకాశం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, మాజీ సైనిక ఉద్యోగుల పిల్లలకు ప్రవేశాల్లో మొదటి ప్రాధాన్యం కల్పిస్తారు. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ, రాష్ట్ర ప్రభుత్వ, అనుబంధ సంస్థల ఉద్యోగులకు వరుసగా రెండు, మూడు, నాలుగో ప్రాధాన్యం ఇస్తారు. మిగిలిన వారికి అయిదో ప్రాధాన్యం ఉంటుంది.
దరఖాస్తు విధానం ఇలా..
కేంద్రీయ విద్యాలయంలో ఒకటో తరగతిలో 80 సీట్లు ఉంటాయి. ఇందులో ప్రవేశానికి 6 నుంచి 8 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. 2023 మార్చి 31 నాటికి ఆరేళ్లు నిండి ఉండాలి. ప్రవేశాలకు ఏప్రిల్ 17లోపు http://kvsonlineadmission.kvs.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. kvs admission యాప్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
* రెండో తరగతి నుంచి ఇంటర్ వరకు ప్రవేశాలను మాత్రం ఆఫ్‌లైన్‌లో నిర్వహిస్తారు. పాఠశాలలోని ఖాళీలకు అనుగుణంగా మెరిట్ ప్రకారం ప్రవేశాలను కల్పిస్తారు. ఏకైక సంతానం ఉన్న బాలికలకు ప్రాధాన్యం ఉంటుంది. దరఖాస్తులు ఏప్రిల్ 3 నుంచి 12 వరకు అందించాలి. మెరిట్ జాబితాను ఏప్రిల్ 17న వెల్లడిస్తారు. ఎనిమిదో తరగతి వరకు ప్రవేశ పరీక్షలు ఉండవు. ప్రయారిటీ కేటగిరీ సిస్టం ప్రకారం సీటు కేటాయిస్తారు. సీట్ల సంఖ్య కంటే దరఖాస్తులు ఎక్కువగా వస్తే లాటరీ పద్ధతిలో విద్యార్థులను ఎంపిక చేస్తారు. తొమ్మిదో తరగతిలో ప్రవేశానికి పరీక్ష నిర్వహిస్తారు. పదో తరగతిలో సీట్లు మిగిలితే ప్రవేశాలు నిర్వహిస్తారు. పదకొండో తరగతి ప్రవేశాలకు సంబంధించి పదో తరగతి మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
* రెండో తరగతి, మూడో తరగతిలో ప్రవేశానికి 7-9 ఏళ్ల మధ్య, నాలుగో తరగతికి 8-10, అయిదో తరగతికి 9-11, ఆరుకు 10-12, ఏడుకు 11-13, ఎనిమిదికి 12-14, తొమ్మిదికి 13-15, పదికి 14-16 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. రిజర్వుడ్ కేటగిరీ విద్యార్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
సద్వినియోగం చేసుకోవాలి : ఒకటో తరగతిలో ప్రవేశాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ఇప్పటికే ప్రారంభించాం. ఎంపిక విధానం పూర్తి పారదర్శకంగా జిల్లా కలెక్టర్ సమక్షంలో జరుగుతుంది. ఉమ్మడి జిల్లాకు చెందిన విద్యార్థులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలి.
దశరథరామ్, కేంద్రీయ విద్యాలయం ప్రిన్సిపల్, మహబూబ్‌నగర్
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
పరిహారం కోసం ‘చావు’ తెలివి
-
World News
పాక్ మీడియాలో ఇమ్రాన్ కనిపించరు.. వినిపించరు
-
Ap-top-news News
9వ తేదీ వరకు పలు రైళ్ల రద్దు: విజయవాడ రైల్వే అధికారులు
-
India News
క్రికెట్ బుకీని ఫోన్‌కాల్స్‌తో పట్టించిన అమృతా ఫడణవీస్
-
India News
సోదరి కులాంతర వివాహం.. బైక్‌పై వచ్చి ఎత్తుకెళ్లిన అన్న
-
Movies News
స్నేహితుల మధ్య ప్రేమ మొదలైతే..