logo

లారీ బోల్తా: డ్రైవర్‌ దుర్మరణం

టైల్స్‌ లోడుతో జాతీయ రహదారిపై వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తాపడిన ప్రమాదంలో ఒకరు మృతిచెందగా..

Published : 27 Mar 2023 04:49 IST

క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన డ్రైవర్‌ హేమేందర్‌సింగ్‌

మానవపాడు, న్యూస్‌టుడే : టైల్స్‌ లోడుతో జాతీయ రహదారిపై వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తాపడిన ప్రమాదంలో ఒకరు మృతిచెందగా.. మరొకరు తీవ్ర గాయాలకు గురైన ఘటన ఆదివారం మండల పరిధిలో జరిగింది. ఎస్సై సంతోష్‌, స్థానికులు తెలిపిన మేరకు వివరాలు.. గుజరాత్‌ నుంచి టైల్స్‌ లోడుతో లారీ జాతీయ రహదారి మీదుగా కర్నూలుకు వెళ్తోంది. వాహనం బోరవెల్లి స్టేజీ సమీపంలోకి రాగానే అదుపుతప్పడంతో రహదారి కిందకు దూసుకెళ్లి బోల్తా పడింది. ప్రమాదంలో రాజస్థాన్‌కు చెందిన డ్రైవర్‌ కమలేష్‌ (26) అక్కడికక్కడే మృతిచెందారు. మరో డ్రైవర్‌ హేమేందర్‌సింగ్‌ గాయాలకు గురయ్యారు. ఇతను లారీ క్యాబిన్‌లో ఇరుక్కుపోవడంతో హైవే పెట్రోలింగ్‌ సిబ్బంది బయటకు తీసి, చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జాతీయ రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడకుండా పోలీసులు అవసరమైన చర్యలు తీసుకున్నారు. మరో 15 రోజుల్లో కమలేష్‌ వివాహం జరగనున్నట్లు సమాచారం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు