లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు
లారీని వెనుక నుంచి బస్సు ఢీకొన్న ప్రమాదంలో బస్సు డ్రైవర్, కండక్టర్ తీవ్రంగా గాయపడ్డారు.
డ్రైవర్, కండక్టర్‌కు తీవ్ర గాయాలు
లారీను ఢీకొన్న బస్సు
కొత్తూరు, న్యూస్‌టుడే: లారీని వెనుక నుంచి బస్సు ఢీకొన్న ప్రమాదంలో బస్సు డ్రైవర్, కండక్టర్ తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా కొత్తూరు పరిధిలోని తిమ్మాపూరు జాతీయ రహదారిపై శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. ఎస్సై శంకర్ వివరాల ప్రకారం.. వనపర్తి ఆర్టీసీ డిపో బస్సు శనివారం రాత్రి సుమారు 25 మందితో హైదరాబాద్ బయలుదేరింది. తిమ్మాపూరు వద్ద ఐరన్ లోడుతో వెళ్తున్న లారీని వెనుక నుంచి బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సు ముందుభాగం నుజ్జయింది. బస్సు డ్రైవర్ రాములు (52), కండక్టర్ వేణుగోపాలచారి (54)కి తీవ్ర గాయాలయ్యాయి. నిద్రమత్తులో ఉన్న పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఉస్మానియాకు తరలించారు. వేణుగోపాలచారి పరిస్థితి విషమంగా ఉంది. ఆదివారం ఉదయం వనపర్తి డిపో మేనేజర్ పరమేశ్వరి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు
కండక్టర్ వేణుగోపాలచారి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
పాక్ మీడియాలో ఇమ్రాన్ కనిపించరు.. వినిపించరు
-
Ap-top-news News
9వ తేదీ వరకు పలు రైళ్ల రద్దు: విజయవాడ రైల్వే అధికారులు
-
India News
క్రికెట్ బుకీని ఫోన్‌కాల్స్‌తో పట్టించిన అమృతా ఫడణవీస్
-
India News
సోదరి కులాంతర వివాహం.. బైక్‌పై వచ్చి ఎత్తుకెళ్లిన అన్న
-
Movies News
స్నేహితుల మధ్య ప్రేమ మొదలైతే..
-
Politics News
మీకు బుద్ధి.. జ్ఞానం ఉన్నాయా?..అధికారులపై విరుచుకుపడిన మంత్రి జోగి