logo

ప్రశ్న పత్రాల లీకేజీ : మరొకరి అరెస్టు

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. గండీడ్‌ మండలంలో ఇప్పటికే రేణుకతో పాటు ఆమె భర్త డాక్యనాయక్‌, రాజేశ్వర్‌, గోపాల్‌, నీలేశ్‌, శ్రీనివాస్‌లను సిట్‌ అధికారులు అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టి వివరాలు సేకరిస్తున్నారు.

Published : 27 Mar 2023 04:49 IST

గండీడ్‌, న్యూస్‌టుడే : టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. గండీడ్‌ మండలంలో ఇప్పటికే రేణుకతో పాటు ఆమె భర్త డాక్యనాయక్‌, రాజేశ్వర్‌, గోపాల్‌, నీలేశ్‌, శ్రీనివాస్‌లను సిట్‌ అధికారులు అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టి వివరాలు సేకరిస్తున్నారు. తాజాగా ఉపాధిహామీ పథకం సాంకేతిక సహాయకుడిగా పనిచేసే గండీడ్‌ మండలం సల్కర్‌పేట్‌ గ్రామానికి చెందిన తిరుపతయ్యను అరెస్టు చేయటం చర్చనీయాంశమైంది. డాక్య నాయక్‌తో సంబంధం ఉండటంతో అతడిని అదుపులోకి తీసుకున్నారని విశ్వసనీయ సమాచారం. ఇప్పటివరకు మండలంలో ఏడుగురు అరెస్టు అయ్యారు. పేపర్‌ లీకేజీ వ్యవహారంలో గండీడ్‌ మండలంలో ఇంకా ఎంత మంది ఉన్నారోనన్న చర్చ సర్వత్రా జరుగుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని