logo

పదికి పకడ్బందీ ఏర్పాట్లు : కలెక్టర్‌

పది పరీక్షలను విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జిల్లా కలెక్టర్లను, సంబంధిత అధికారులను ఆదేశించారు.

Published : 30 Mar 2023 05:44 IST

వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరైన కలెక్టర్‌, ఎస్పీ

గద్వాల కలెక్టరేట్‌, న్యూస్‌టుడే : పది పరీక్షలను విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జిల్లా కలెక్టర్లను, సంబంధిత అధికారులను ఆదేశించారు. ఏప్రిల్‌ 3 నుంచి 13వ తేదీ వరకు జరిగే పరీక్షల నిర్వహణ కోసం అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. బుధవారం హైదరాబాద్‌ నుంచి విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్య డైరెక్టర్‌ దేవసేనతో కలిసి పది పరీక్షలపై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పాల్గొన్న కలెక్టర్‌ వల్లూరు క్రాంతి మాట్లాడుతూ జిల్లాలో 7,370 మంది విద్యార్థులు పది పరీక్షలకు హాజరవుతున్నారని, పరీక్షల నిర్వహణకు జిల్లా వ్యాప్తంగా 41 కేంద్రాలు ఏర్పాటు చేశామని, పోలీసు స్టేషన్‌కు దూరంగా ఉన్న 13 కేంద్రాలకు పరీక్ష పత్రాల తరలింపునకు 9 రూట్లను గుర్తించామన్నారు. పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని చెప్పారు. జిల్లాలో 10వ తేదీన నిర్వహించే సామాన్య శాస్త్రం పరీక్షను ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.50 వరకు ఉంటుందన్నారు. ఈ విషయాన్ని విద్యార్థులు గమనించాలన్నారు. ఎస్పీ సృజన మాట్లాడుతూ కేంద్రాల వద్ద పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేస్తామని తెలిపారు. సమావేశంలో డీఈవో సిరాజుద్దీన్‌, డీఎంహెచ్‌వో డాక్టర్‌ శశికళ ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని