logo

సలేశ్వరుడి సన్నిధికి వెళ్లొద్దామా

నల్లమలలోని ఎత్తైన కొండల నడుమ లోతైన లోయలో కొలువైన సలేశ్వర క్షేత్రం ఉత్సవాలకు సిద్ధమైంది.

Published : 30 Mar 2023 05:58 IST

న్యూస్‌టుడే,అచ్చంపేట న్యూటౌన్‌

క్షేత్రం సమీపంలో వెలసిన గుండం వద్ద భక్తులు (పాత చిత్రం)

నల్లమలలోని ఎత్తైన కొండల నడుమ లోతైన లోయలో కొలువైన సలేశ్వర క్షేత్రం ఉత్సవాలకు సిద్ధమైంది. ఏటా చైత్ర పూర్ణిమ సందర్భంగా క్షేత్రంలోని లింగమయ్య దర్శనానికి ఎత్తైన కొండల్లో రాళ్ల మధ్య నుంచి భక్తులు కాలినడకన యాత్ర కొనసాగిస్తారు. జాతరకు రాష్ట్రం నలుమూలల నుంచి పర్యాటకులు, భక్తులు హాజరవుతుంటారు. ఏప్రిల్‌ 5, 6, 7 తేదీల్లో 3 రోజుల పాటు నిర్వహించే జాతరకు నల్లమల అటవీ ప్రాంతం నుంచి భక్తులు వెళ్లేందుకు అధికారులు అనుమతించారు. సలేశ్వర కొండల్లో రాళ్ల మీదుగా 4 కిలో మీటర్ల మేరకు నడిచి లోయలోకి వెళ్లి లింగమయ్యను దర్శించుకునే సందర్భంలో ప్రమాదాల బారిన పడకుండా చెôచు వాలంటీర్లను నియమించారు. ఉత్సవాలకు మహబూబ్‌నగర్‌, హైదరాబాద్‌, రంగారెడ్డి, నల్గొండ, జోగులాంబ గద్వాల, వనపర్తి, కర్నూల్‌ తదితర ప్రాంతాల నుంచి పర్యాటకులు వేల సంఖ్యలో వస్తుంటారు. వాహనాల్లో వెళ్లే వారు అమ్రాబాద్‌ మండలం మన్ననూర్‌ మీదుగా శ్రీశైలం ప్రధాన రహదారిలో ఉన్న పరహాబాద్‌ కూడలి వద్ద అటవీశాఖ అధికారుల అనుమతులతో అడవిలోకి వెళ్లాల్సి ఉంటుంది. స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు అన్నదానం, తాగునీటి వసతి ఏర్పాటు చేయనున్నారు. అచ్చంపేట ఆర్టీసీ డిపో నుంచి  ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు డిపో మేనేజర్‌ రాజశేఖర్‌ తెలిపారు. 3 రోజుల పాటు సలేశ్వర క్షేత్రానికి వెళ్లేందుకు నిబంధనలతో కూడిన అనుమతులు ఉంటాయని డీఎఫ్‌వో రోహిత్‌ గోపిడి పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని