logo

రెండో రోజూ జడ్పీ సర్వసభ్య సమావేశం వాయిదా

వనపర్తి జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం బుధవారం జరగాల్సి ఉండగా జడ్పీటీసీ సభ్యులు రాకపోవడంతో మరోసారి వాయిదా పడింది

Published : 30 Mar 2023 05:58 IST

సభ్యుల గైర్హాజరుతో ఖాళీగా దర్శనమిస్తున్న కుర్చీలు

వనపర్తి, న్యూస్‌టుడే :  వనపర్తి జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం బుధవారం జరగాల్సి ఉండగా జడ్పీటీసీ సభ్యులు రాకపోవడంతో మరోసారి వాయిదా పడింది. మంగళవారం జిల్లా పరిషత్తు ఛైర్మన్‌ లోక్‌నాథ్‌రెడ్డి అధ్యక్షతన సమావేశం జరగాల్సి ఉండగా ఒక సభ్యుడి హాజరు, మెజారిటీ సభ్యుల గైర్హాజరుతో మరుసటి రోజుకు వాయిదా వేసిన విషయం తెలిసిందే. మార్చి నెలాఖరుకు పెండింగులోని బిల్లులు క్లియర్‌ చేసేందుకు సభ్యులు హాజరుకావాలని ఛైర్మన్‌ విజ్ఞప్తి చేశారు. దీంతో జిల్లాలోని అన్ని శాఖల అధికారులు ఉదయం పదిన్నరకే జిల్లా పరిషత్తుకు చేరుకున్నారు. ఉదయం పదకొండు గంటలయినా శ్రీరంగాపూర్‌ సభ్యుడు రాజేంద్రప్రసాద్‌ మినహా మెజార్టీ సభ్యులెవరూ హాజరుకాకపోవడంతో సమావేశాన్ని వాయిదా వేశారు. దీంతో వచ్చిన వివిధ శాఖల అధికారులు వెనుదిరిగారు. జడ్పీ ఛైర్మన్‌ లోక్‌నాథ్‌రెడ్డి కూడా సమావేశానికి రాకపోవడం కొసమెరుపు. ఈ విషయమై జడ్పీ సీఈవోను వివరణ కోరగా సభ్యులు రానందున సమావేశాన్ని వాయిదా వేశామని, తమ నిబంధనల ప్రకారం తిరిగి మూడు నెలల తర్వాతే జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని