logo

ఇక పాలమూరుకు విశాఖ- కాచిగూడ రైలు

విశాఖపట్నం నుంచి కాచిగూడ వరకు నడుస్తున్న రోజువారి ఎక్స్‌ప్రెస్‌ రైలును మహబూబ్‌నగర్‌ వరకు పొడిగిస్తున్నారు.

Published : 18 May 2023 05:39 IST

20న ప్రారంభించనున్న కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి

మహబూబ్‌నగర్‌- కాచిగూడ మధ్య నడవనున్న రైలు

మహబూబ్‌నగర్‌ పట్టణం, న్యూస్‌టుడే: విశాఖపట్నం నుంచి కాచిగూడ వరకు నడుస్తున్న రోజువారి ఎక్స్‌ప్రెస్‌ రైలును మహబూబ్‌నగర్‌ వరకు పొడిగిస్తున్నారు. ఈ రైలును పొడిగించాలంటూ చాలా రోజులుగా ప్రయాణికులు రైల్వే అధికారులు కేంద్ర మంత్రులు, ఎంపీల దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన కేంద్ర ప్రభుత్వం విశాఖ నుంచి మహబూబ్‌నగర్‌ వరకు ఈ రైలును పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 20న కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్‌రెడ్డి ఇక్కడి రైల్వే స్టేషన్‌లో జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఇక నుంచి 12861-62 విశాఖపట్నం-కాచిగూడ-మహబూబ్‌నగర్‌ వరకు నడవనుంది. తిరుగు ప్రయాణంలో 12682-81 మహబూబ్‌నగర్‌-కాచిగూడ- విశాఖపట్నం ప్రయాణించనుంది. ఈనెల 19 నుంచి ప్రతిరోజు విశాఖపట్నంలో సాయంత్రం 06.40గంటలకు బయలుదేరి దువ్వాడ, అనకాపల్లి, తుని, అన్నవరం, సామర్లకోట జంక్షన్‌, రాజమండ్రి, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, రాయనపాడు(విజయవాడ), ఖమ్మం, డోర్నకల్‌, మహబూబాబాద్‌, వరంగల్‌, ఖాజీపేట జంక్షన్‌, మల్కాజిగిరి, కాచిగూడ, షాద్‌నగర్‌, జడ్చర్ల మీదుగా మహబూబ్‌నగర్‌కు ఉదయం 09.20 గంటలకు చేరుకుంటుంది. మహబూబ్‌నగర్‌ నుంచి ప్రతిరోజు ఇదే రైలు సాయంత్రం 04.10 గంటలకు బయలుదేరి ఉదయం 7.00 గంటల విశాఖపట్నం చేరుకుంటుంది. కిషన్‌రెడ్డి పర్యటన నేపథ్యంలో రైల్వే స్టేషనులో ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ప్రస్తుతం 08585-86 విశాఖపట్నం- మహబూబ్‌నగర్‌- విశాఖపట్నం వారాంతపు రైలు నడుస్తోంది. ఈ కొత్త రైలుతో ఈ మార్గంలో రెండు రైళ్లు  సేవలు అందించనున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని