సెలవు.. సృజనకు నెలవు
వేసవి సెలవులు అనగానే చాలా మంది చిన్నారులు సరదాగా గడపడానికి ఆసక్తి చూపుతారు. పాఠశాలలో కుస్తీ పట్టిన పుస్తకాలను పక్కన పెట్టి ఆటపాటలతో కాలక్షేపం చేసేందుకు మొగ్గు చూపుతారు.
ముందుచూపుతో అడుగులు
యోగా సాధన చేస్తున్న విద్యార్థులు
అచ్చంపేట, న్యూస్‌టుడే : వేసవి సెలవులు అనగానే చాలా మంది చిన్నారులు సరదాగా గడపడానికి ఆసక్తి చూపుతారు. పాఠశాలలో కుస్తీ పట్టిన పుస్తకాలను పక్కన పెట్టి ఆటపాటలతో కాలక్షేపం చేసేందుకు మొగ్గు చూపుతారు. అమ్మమ్మ ఇంటికో లేదా ఇతర బంధువుల ఇళ్లకో వెళ్లడం, యాత్రా ప్రదేశాలకు వెళ్లి రావడం తదితర కార్యక్రమాలతో సెలవులు గడిపేస్తుంటారు. చాలా మంది సెలవులను సరదాగా గడిపేందుకు వినియోగిస్తుండగా కొందరు తల్లిదండ్రులు, పిల్లలు ప్రణాళికాబద్ధంగా సద్వినియోగం చేసుకుంటున్నారు. భవిష్యత్తులో ఉపయోగపడే నైపుణ్యాలు పెంపొందించుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. దివంగత భారత మాజీ రాష్ట్రపతి, క్షిపణి శాస్త్రవేత్త అబ్దుల్ కలాం చెప్పిన ‘కలలు కనాలి వాటి సాకారానికి కృషి చేయాల’న్న స్ఫూర్తిదాయకమైన మాటలను కొందరు విద్యార్థులు ఆచరణలో పెడుతున్నారు. వివిధ అంశాలను నేర్చుకుంటూ వేసవి సెలవులను సద్వినియోగం చేసుకుంటున్న విద్యార్థులపై కథనం..
చిత్రలేఖనం అభ్యాసం.. : చిన్నప్పటి నుంచి బొమ్మలు గీయడంపై ఎంతో ఆసక్తి ఉంది. పాఠశాలలో కూడా పుస్తకాల్లోని బొమ్మలు గీసి ఉపాధ్యాయులకు చూపించినప్పుడు మెచ్చుకున్నారు. రోజు పాఠశాలలో కొంత సమయం చిత్రలేఖనానికి సమయం ఇచ్చి మెలకువలు నేర్పారు. ప్రస్తుతం సెలవుల్లో ఆన్‌లైన్‌లో బొమ్మలు గీయడాన్ని వీడియోల్లో చూస్తూ మెలకువలు నేర్చుకుంటున్నా. పాఠ్య పుస్తకాల్లోని వివిధ రకాల బొమ్మలతో పాటు ఆన్‌లైన్‌లో చూసి కొత్త బొమ్మలు గీయడం నేర్చుకుంటున్నా.
తారక, ఉప్పునుంతల
కంప్యూటర్ విద్యలో మెళకువలు.. : కంప్యూటర్ విద్యకు ఉన్న ప్రాధాన్యం గురించి అమ్మానాన్న చెప్పడంతో వేసవిలో వివిధ కొత్త కోర్సులను నేర్చుకుంటున్నా. వార్షిక పరీక్షలు ముగిసినప్పటి నుంచి శిక్షణకు వెళ్తున్నా.. రోజు రెండు గంటల పాటు కంప్యూటర్ శిక్షణ, అనంతరం టైపింగ్ సాధన చేస్తున్నా.. కంప్యూటర్ శిక్షణ ఆసక్తి కలిగిస్తోంది. కొత్త విషయాలను నేర్చుకోవడం ఆత్మవిశ్వాసం పెంపొందిస్తోంది.
పల్లవి, అచ్చంపేట
వందేమాతరం ఫౌండేషన్‌లో శిక్షణ : వేసవి సెలవుల్లో వందేమాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 15 రోజుల శిక్షణ తరగతుల్లో పాల్గొన్నా. పాఠశాలలో చదివిన విధానానికి అక్కడ చూసిన పద్ధతులు కొత్తగా ఉన్నాయి. పనిచేయడం ద్వారా చదువుకోవడం ఎంతో సరదాగా అనిపించింది. పాఠశాల ఉన్నప్పుడు పూర్తి సమయం పుస్తకాలతో గడపడం ఎంతో ఇబ్బందిగా ఉండేది. ఫౌండేషన్ శిక్షణలో చదువుతో పాటు యోగా, ధ్యానం, ఈత, నృత్యం, ఆటలు ఆడటం తదితర అంశాలతో సరదగా గడిపాను. శిక్షణ పూర్తి చేసిన తరువాత కూడా ఇంటి వద్ద సాధన చేస్తున్నా.
బిందు సారథి, వంకేశ్వరం (పదర)
కోడింగ్‌పై ఆసక్తి.. : వేసవి సెలవుల్లో కంప్యూటర్ కోడింగ్ శిక్షణ తరగతులకు వెళ్తున్నా.. భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగడానికి కోడింగ్ విధానం ఎంతో ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో ప్రత్యేక శ్రద్ధతో శిక్షణ తీసుకుంటున్నా. స్పోకెన్ ఇంగ్లీషు, గణితం, భౌతిక శాస్త్రంలోని వివిధ పాఠ్యాంశాలను సాధన చేస్తున్నా. నిత్యం కొంత సమయాన్ని ఎంబ్రాయిడరీ నేర్చుకోవడానికి కేటాయిస్తున్నా. సెలవులను వృథా చేయకుండా వివిధ కొత్త అంశాలను నేర్చుకోవడానికి కృషి చేస్తున్నా.
శ్వేత, కొండనాగుల (బల్మూరు)
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World Cup: ఆ ఇద్దరూ ఉండటం వల్లే సంజూ శాంసన్‌ను ఎంపిక చేయలేదు: హర్భజన్ సింగ్
-
TDP: వైకాపా దౌర్జన్యాలను ఎలా ఎదుర్కొందాం? టీడీఎల్పీలో చర్చ
-
Flipkart: మరోసారి బిగ్ బిలియన్ డేస్ సేల్.. వాటిపై భారీ డిస్కౌంట్!
-
LEO Movie: పోస్టర్లతోనే ‘లియో’ కథను హింట్ ఇచ్చారా? ఆ జాబితాలోనూ నెం.1
-
Canada: భారత్ విజ్ఞప్తులు బుట్టదాఖలు.. ‘మోస్ట్ వాంటెడ్’లకు స్థావరంగా కెనడా!
-
TTD: వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. గరుడసేవకు ప్రత్యేక ఏర్పాట్లు