logo

పాలమూరులో సమస్యలు లేకుండా చేయడమే ధ్యేయం

ఉమ్మడి పాలమూరు జిల్లాలో సమస్యలు లేకుండా చేయడమే ధ్యేయమని, హైదరాబాద్‌ తర్వాత జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్టు మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు.

Published : 01 Jun 2023 04:00 IST

కేసీఆర్‌ మాత్రమే రాష్ట్రాన్ని కాపాడగలుగుతారు: మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, చిత్రంలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, జడ్పీ అధ్యక్షురాలు స్వర్ణసుధాకర్‌రెడ్డి

జడ్చర్ల గ్రామీణం, న్యూస్‌టుడే : ఉమ్మడి పాలమూరు జిల్లాలో సమస్యలు లేకుండా చేయడమే ధ్యేయమని, హైదరాబాద్‌ తర్వాత జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్టు మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. జడ్చర్ల మండలం కొడ్గల్‌లో బుధవారం రూ.5 కోట్లతో నిర్మించిన గిరిజన గురుకుల బాలిక పాఠశాలతోపాటు ఇతర అభివృద్ధి పనుల్ని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణను సీఎం కేసీఆర్‌ మాత్రమే కాపాడగలరని, భారాస హయాంలోనే రాష్ట్రం బాగుపడిందన్నారు. జూరాల కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న ఉదండాపూర్‌, కర్వేన జలాశయాలు నిర్మిస్తున్నారని జిల్లాకు నీళ్లు ఇచ్చేందుకు ప్రభుత్వం పని చేస్తుంëన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంపై కక్షగట్టిందన్నారు. ఒక్క ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా ఇవ్వమని ప్రకటించారని గుర్తు చేశారు. జడ్చర్లలోని రెండు మెట్ల బావులను పర్యాటకశాఖ ద్వారా అభివృద్ధి చేస్తామన్నారు. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్‌ హయాంలో జిల్లాకు, జడ్చర్లకు చేసిందేమీలేదన్నారు. సీఎం కేసీఆర్‌ విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, జడ్పీ ఛైర్‌పర్సన్‌ స్వర్ణసుధాకర్‌రెడ్డి, వైస్‌ ఛైర్మన్‌ యాదయ్య, సర్పంచి మమత మాట్లాడారు. డీసీఎంఎస్‌ అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, బాదేపల్లి సహకార సంఘం అధ్యక్షుడు సుదర్శన్‌గౌడ్‌, మార్కెట్‌ కమిటీ అధ్యక్షుడు గోవర్దన్‌రెడ్డి, వైస్‌ ఛైర్మన్‌ మహ్మద్‌అలీదానిష్‌, సర్పంచి హైమావతి, బి.శివకుమార్‌, ఇంతియాజ్‌ఖాన్‌, శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

పూర్వ విద్యార్థులకు సన్మానం

కొడ్గల్‌ జడ్పీ ఉన్నత పాఠశాల 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బుధవారం పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. స్వర్ణోత్సవ వేడుకల ప్రత్యేక సంచికను విడుదల చేశారు. పదో తరగతిలో మొదటి బ్యాచ్‌ పూర్వ విద్యార్థులకు మంత్రి, ఎమ్మెల్యే జ్ఞాపికలు అందజేశారు. వందలాది మంది విద్యార్థులు పాల్గొని పాత జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఉపాధ్యాయులకు సన్మానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని