logo

రైతు దినోత్సవాన్ని వైభవంగా నిర్వహించాలి

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జూన్‌ 3న రైతు దినోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేయాలని కలెక్టర్‌ తేజస్‌ నంద్లాల్‌ పవార్‌ జిల్లా అధికారులను ఆదేశించారు.

Published : 01 Jun 2023 04:00 IST

రైతు వేదికను పరిశీలిస్తున్న కలెక్టర్‌ తేజస్‌ నంద్లాల్‌ పవార్‌, అధికారులు

వనపర్తి, న్యూస్‌టుడే : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జూన్‌ 3న రైతు దినోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేయాలని కలెక్టర్‌ తేజస్‌ నంద్లాల్‌ పవార్‌ జిల్లా అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కేంద్రం శివారు నాగవరం రైతు వేదికలో రైతు దినోత్సవంపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రైతు వేదికలో జరిగే ఉత్సవాలకు ఒక్కో క్లస్టర్‌ నుంచి అయిదువేల మంది రైతులు పాల్గొనేలా కృషి చేయాలన్నారు. రైతులు ఎడ్లబండ్లు, ట్రాక్టర్లు, డప్పు, బ్యాండుబాజాలతో వచ్చేలా ఏర్పాట్లు చేయాలన్నారు. రైతులు కూర్చోడానికి చలువ పందిళ్లు, తాగునీరు, భోజనాల ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని చెప్పారు. రైతు వేదికలను అందంగా అలంకరించాలని ఆదేశించారు. రాత్రి వనపర్తిలోని తన క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల కార్యక్రమాల గురించి మీడియాకు వెల్లడించారు. ఏరోజు ఏమేమి కార్యక్రమాలు చేపట్టనున్నారో వివరించారు. సమావేశంలో అదనపు కలెక్టరు వేణుగోపాల్‌, ఆర్డీవో పద్మావతి, జిల్లా వ్యవసాయ అధికారి సుధాకర్‌రెడ్డి, ఉద్యాన శాఖ అధికారి సురేష్‌, పురపాలక సంఘం కమిషనర్‌ విక్రమసింహారెడ్డి, జిల్లా సహకార అధికారి కాళిక్రాంతి పాల్గొన్నారు.

ఏర్పాట్ల పరిశీలన..

వనపర్తి, న్యూస్‌టుడే :  రైతు దిన వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి జిల్లా అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన జిల్లా కేంద్రం శివారు నాగవరం తండా వద్దనున్న రైతు వేదికను సందర్శించారు. ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లను కలెక్టరు తేజస్‌ నంద్లాల్‌ పవార్‌తో కలిసి పరిశీలించారు. వేదిక వద్ద అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు. పంట కాలాన్ని నెల రోజులు ముందుకు జరపడంపై రైతు దినోత్సవాన అన్నదాతలకు అవగాహన కల్పిస్తామని చెప్పారు.  రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్‌ సాయిచంద్‌, పురపాలక సంఘం అధ్యక్షుడు గట్టు యాదవ్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని