logo

రైతు దినోత్సవానికి పకడ్బందీ ఏర్పాటు

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం నిర్వహించే రైతు దినోత్సవాన్ని సర్వం సిద్దం చేసినట్లు జిల్లా కలెక్టరు తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌ తెలిపారు.

Published : 03 Jun 2023 04:25 IST

కొత్తకోట : పాలెం రైతు వేదిక వద్ద ఏర్పాట్లపై   సూచనలిస్తున్న కలెక్టర్‌ తేజస్‌ నంద్లాల్‌ పవార్‌

వనపర్తి, న్యూస్‌టుడే : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం నిర్వహించే రైతు దినోత్సవాన్ని సర్వం సిద్దం చేసినట్లు జిల్లా కలెక్టరు తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌ తెలిపారు. శుక్రవారం ఆయన జిల్లా కేంద్రం శివారు నాగవరం వద్ద రైతు వేదికను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, అవసరమైన మౌలిక సదుపాయాలు, తాగునీరు, భోజన వసతి తదితరాల ఏర్పాట్లను తెలుసుకున్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టరు వేణుగోపాల్‌, జిల్లా వ్యవసాయాధికారి సుధాకర్‌రెడ్డి, డీపీవో సురేష్‌, జిల్లా ఉద్యాన అధికారి కె.సురేష్‌, పుర కమిషనర్‌ విక్రమసింహరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కొత్తకోట, న్యూస్‌టుడే : రైతు వేదికల వద్ద శనివారం తలపెట్టిన రైతు ఉత్సవాలు వైభవంగా, కార్యక్రమాలు అన్నదాతలను ఆకట్టుకునేలా ఉండాలని కలెక్టర్‌ తేజస్‌ నంద్లాల్‌ పవార్‌ సూచించారు. శుక్రవారం సాయంత్రం మండల పరిధిలోని పాలెం రైతు వేదిక వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. విండో అధ్యక్షుడు వంశీధర్‌రెడ్డి, సీడీసీ ఛైర్మన్‌ చెన్నకేశవరెడ్డితో మాట్లాడారు. ప్రభుత్వం వల్ల లబ్ధి పొందిన ప్రతి రైతు సంబరాల్లో పాల్గొనేలా చూడాలని సూచించారు. పీఆర్‌ డీఈ నాగేశ్వర్‌రావు, గ్రామ నాయకులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని