వర్షాకాలమొస్తోంది.. మరమ్మతులేవీ..!
వర్షాకాలం ప్రారంభవుతున్నా నిర్మిత ప్రాజెక్టుల కాలువలు, పిల్ల కాలువలు, తూముల మరమ్మతులపై జలవనరులశాఖ దృష్టి సారించడం లేదు. గత ఐదేళ్లుగా భారీ వర్షాలు పడుతుండటం, ఎగువ నుంచి కృష్ణా నది పోటెత్తుండటంతో ఏటా 1500 టీఎంసీల వరకు వరదనీరు జూరాల ద్వారా వెళ్తోంది. భారీ వర్షాలు పడుతున్నా..
కాలువలో పిచ్చి మొక్కలు
పంపుహౌస్ మోటార్లలోనూ చేపట్టని డ్రైరన్
భీమా పరిధిలోని సంగంబండ కాలువలో పిచ్చి మొక్కలు
ఈనాడు డిజిటల్, మహబూబ్‌నగర్: వర్షాకాలం ప్రారంభవుతున్నా నిర్మిత ప్రాజెక్టుల కాలువలు, పిల్ల కాలువలు, తూముల మరమ్మతులపై జలవనరులశాఖ దృష్టి సారించడం లేదు. గత ఐదేళ్లుగా భారీ వర్షాలు పడుతుండటం, ఎగువ నుంచి కృష్ణా నది పోటెత్తుండటంతో ఏటా 1500 టీఎంసీల వరకు వరదనీరు జూరాల ద్వారా వెళ్తోంది. భారీ వర్షాలు పడుతున్నా.. కాలువల ద్వారా ఆయకట్టుకు సాగునీరు పూర్తి స్థాయిలో అందడం లేదు. ఉమ్మడి జిల్లాలో కోయిల్‌సాగర్, భీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి నిర్మిత ప్రాజెక్టులున్నాయి. వీటి పరిధిలో ప్రస్తుతం 6.45లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. కానీ కాలువలకు లైనింగ్ లేకపోవడం, పిచ్చి మొక్కలు, జమ్ము మొలవడంతో కాలువల్లోకి వరద ప్రవాహం నెమ్మదిస్తోంది. దీనికి తోడు పలుచోట్ల తూములు పాడయ్యాయి. కాలువల నుంచి రైతుల పొలాలకు నీటిని మళ్లించే పిల్ల కాలువలు ధ్వంసమయ్యాయి. వీటికి పూర్తి స్థాయిలో మరమ్మతులు లేకపోవడంతో ఏటా ఆయకట్టుకు సాగునీరు సరఫరాలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వేసవిలో కాలువలు, తూములు, పిల్ల కాలువల మరమ్మతులు జలవనరుల శాఖ చేపట్టాల్సి ఉన్నప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
పంపు హౌజ్‌ల వద్ద కూడా ఇదే పరిస్థితి...: నిర్మిత ప్రాజెక్టులకు సంబంధించిన పంపుహౌస్‌ల వద్ద ఏటా సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. ఒక్కసారిగా జూరాలకు వరద పోటెత్తితే ప్రాజెక్టుల పరిధిలోని పంపులను ఒక్కసారిగా ప్రారంభిస్తుండటంతో మొరాయిస్తున్నాయి. కోయిల్‌సాగర్ పరిధిలో రెండు పంపుహౌస్‌లు, కల్వకుర్తి పరిధిలో మూడు, నెట్టంపాడు పరిధిలో రెండు, భీమా పరిధిలో నాలుగు పంపుహౌస్‌లున్నాయి. ఈ ఎత్తిపోతల పథకాల ద్వారా వరద వస్తే మొత్తం 85 టీఎంసీల నీటిని ఎత్తిపోసుకునేలా కేటాయింపులున్నాయి. పంపుహౌస్‌ల్లో సాంకేతిక సమస్యలతో పూర్తిస్థాయిలో నీటిని తోడుకునే పరిస్థితి ఉండటం లేదు. వర్షాకాలం ప్రారంభానికి ముందే టెండర్లు పిలిచి మరమ్మతులు చేపట్టాలి. అవసరమైతే ప్రత్యేక నిధులు కేటాయించాలి. నాలుగు నిర్మిత పరిధిలో ఎక్కడ కూడా ముందస్తు మరమ్మతులు చేపట్టలేదు. డ్రై రన్ నిర్వహించి సాంకేతిక సమస్యలను గుర్తించాలి. ప్రధానంగా ఈ పనులు చేసిన ఏజెన్సీలు వీటి బాధ్యతలను తీసుకోవాలి. చాలాచోట్ల బిల్లులు సక్రమంగా రావడం లేదని పాత ఏజెన్సీలు విధుల నుంచి తప్పుకున్నాయి. గతంలో కోయిల్‌సాగర్ పరిధిలోని ఉంద్యాల పంపుహౌస్ వద్ద, నెట్టెంపాడు పరిధిలోని గూడెందొడ్డి పంపుహౌస్, కల్వకుర్తి పరిధిలో జొన్నలబొగడ పంపుహౌస్‌లకు సాంకేతిక సమస్యలు తలెత్తడంతో నీటి తోడివేతలో ఇబ్బందులు తలెత్తాయి. ముందస్తుగా మోటార్లకు డ్రై రన్ నిర్వహించి మరమ్మతులు చేపడితే కృష్ణా నదికి వరద ప్రవాహం పెరిగితే జలాశయాలు, చెరువులను నింపుకొనే అవకాశం ఉంటుంది.
అదనపు ఆయకట్టు ఊసేది..
నిర్మిత ప్రాజెక్టుల పరిధిలో ఈ ఏడాది కూడా అదనపు ఆయకట్టుకు సాగునీరు అందే పరిస్థితి లేదు. ఈ పనులు పూర్తయితే మరో 2లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. కనీసం ఉన్న ఆయకట్టు పరిధిలోనైనా కాలువల్లో ఉన్న పిచ్చిమొక్కలు, జమ్ము తొలగించాలని రైతులు కోరుతున్నారు. చాలాచోట్ల తూములు లేకపోవడంతో నీరు వృథాగా పోతుందంటున్నారు. పిల్ల కాలువలు కూడా పూర్తిగా మూసుకుపోయాయని వీటికి మరమ్మతులు చేపడితే సాగునీటి కష్టాలు తప్పుతాయని కర్షకులు అభిప్రాయపడుతున్నారు. దీనిపై జలవననరుల శాఖ మహబూబ్‌నగర్ ఎస్‌ఈ చక్రధరం ‘ఈనాడు’తో మాట్లాడుతూ కాలువలు, తూములకు మరమ్మతులు చేస్తున్నామన్నారు. డ్రైరన్ కూడా కొనసాగించి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా చూస్తామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
ఎవరెస్ట్ వద్ద ఎగిరిన పసుపుజెండా
-
Justice Lakshmana Reddy: జస్టిస్ లక్ష్మణరెడ్డి అరుదైన రికార్డు
-
మీ వాళ్లు కబ్జా చేస్తే.. మీరు సెటిల్మెంట్ చేశారు: ఆదోని ఎమ్మెల్యే కుమారుడిని చుట్టుముట్టిన జనం
-
‘భువనేశ్వరిని అసెంబ్లీ సాక్షిగా అవమానించినప్పుడు ఏం చేశారు?’
-
AP News: హోం మంత్రి వస్తే ఊరొదిలి వెళ్లాలా?
-
పాపికొండల యాత్ర ప్రారంభం