logo

సాంకేతిక విద్యతో ఉపాధికి భరోసా

సాంకేతిక నైపుణ్యాలు పెంపొందించి ఉపాధి అవకాశాలు విస్తృతం చేసేందుకే ప్రభుత్వం పారిశ్రామిక శిక్షణ సంస్థలు(ఐటీఐలు) ఏర్పాటు చేసింది. ఈ ఏడాది ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐ కళాశాలల్లో 2023-24 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది.

Published : 04 Jun 2023 03:29 IST

ఐటీఐ కళాశాలల్లో 3,998 సీట్లు
జూన్‌ 10 వరకు దరఖాస్తులకు గడువు

మెట్టుగడ్డలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాల, మహబూబ్‌నగర్‌

న్యూస్‌టుడే, మహబూబ్‌నగర్‌ అర్బన్‌ : సాంకేతిక నైపుణ్యాలు పెంపొందించి ఉపాధి అవకాశాలు విస్తృతం చేసేందుకే ప్రభుత్వం పారిశ్రామిక శిక్షణ సంస్థలు(ఐటీఐలు) ఏర్పాటు చేసింది. ఈ ఏడాది ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐ కళాశాలల్లో 2023-24 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు జూన్‌ 10 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్థులకు పదో తరగతిలో గ్రేడింగ్‌ ఆధారంగా సీట్ల కేటాయిస్తారు. 8వ తరగతి ఉత్తీర్ణత సాధించిన వారికి కూడా వివిధ కోర్సులు ఉన్నాయి.

అందుబాటులోని కోర్సులు..

ఉమ్మడి జిల్లాలో 31 ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐ కళాశాలలు ఉన్నాయి. ప్రభుత్వ ఐటీఐలు మహబూబ్‌నగర్‌ జిల్లాలో రెండు, నాగర్‌కర్నూల్‌ జిల్లాలో రెండు, జోగులాంబ గద్వాల, వనపర్తి జిల్లాలో ఒక్కోటి చొప్పున ఉన్నాయి. మిగిలినవి 25 ప్రైవేటు ఐటీఐ కళాశాలలు ఉన్నాయి. వీటిలో ఏడాది కాలంలో పూర్తయ్యే కోర్సులు కోపా, మెకానిక్‌ డీజిల్‌, వుడ్‌వర్క్‌ టెక్నీషియన్‌, వెల్డర్‌, సేవింగ్‌ టెక్నాలజీ, శానీటరీ ఇన్స్‌పెక్టర్‌, డ్రస్‌ మేకింగ్‌, స్టెనోగ్రఫీ అందుబాటులో ఉన్నాయి. రెండేళ్ల కోర్సులు ఎలక్ట్రీషియన్‌, ఫిట్టర్‌, మోటార్‌ వెహికిల్‌ మెకానిక్‌, డ్రాప్ట్‌మెన్‌ సివిల్‌, మిషనిస్ట్‌, టర్నర్‌, ఎలక్ట్రానిక్స్‌ మెకానిక్స్‌, ఇన్‌స్ట్రూమెంట్‌ మెకానిక్స్‌ కోర్సులు ఉన్నాయి. అర్హులైన వారు  http:///iti.telangana.gov.in  ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

సద్వినియోగం చేసుకోవాలి

అర్హులైన విద్యార్థులు ఐటీఐలలో ప్రవేశాలకు నిర్దేశిత సమయంలో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ‘భారత్‌ స్కిల్స్‌ యాప్‌’ను సద్వినియోగం చేసుకోవాలి. పరీక్షల సమాచారం కూడా తెలుసుకునే వీలుంటుంది. నాణ్యమైన విద్య అందుబాటులోకి తీసుకురావడం, విద్యార్థుల్లో నైపుణ్యాల పెంపునకు బాటలు వేయాలన్నదే లక్ష్యం.

బి.శాంతయ్య, జిల్లా కన్వీనర్‌, ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్‌, మహబూబ్‌నగర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని