logo

సాగుకు రైతులు సన్నద్ధం

జిల్లాలో అక్కడక్కడ కురుస్తున్న తేలికపాటి వర్షాలతో రైతన్నలు వానాకాలం సాగుకు సన్నద్ధమవుతున్నారు. కొన్ని చోట్ల రైతులు పత్తి, జొన్న,  మరి కొన్నిచోట్ల పచ్చిరొట్ట ఎరువులు, మొక్కజొన్న, వరి, కంది, పెసర, పత్తి విత్తనాలను విత్తుకుంటున్నారు.

Published : 07 Jun 2023 04:03 IST

జిల్లాలో మొదలైన విత్తనాలు, ఎరువుల విక్రయాలు

హన్వాడ : గుడిమల్కాపూర్‌ సమీపంలో ట్రాక్టర్‌తో జొన్న విత్తనం వేస్తున్న రైతులు

మహబూబ్‌నగర్‌ వ్యవసాయం, న్యూస్‌టుడే : జిల్లాలో అక్కడక్కడ కురుస్తున్న తేలికపాటి వర్షాలతో రైతన్నలు వానాకాలం సాగుకు సన్నద్ధమవుతున్నారు. కొన్ని చోట్ల రైతులు పత్తి, జొన్న,  మరి కొన్నిచోట్ల పచ్చిరొట్ట ఎరువులు, మొక్కజొన్న, వరి, కంది, పెసర, పత్తి విత్తనాలను విత్తుకుంటున్నారు. కొందరు రైతులు పెంట ఎరువులను చల్లుకుంటున్నారు. ఇప్పటికే వరికోతలు పూర్తికావటంతో పొలాల్లో చెత్తాచెదారం తొలగించి సాగుకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. కాస్త ఆర్థికంగా ఉన్న రైతులు విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేస్తున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలోని అడ్డాకుల, మిడ్జిల్‌, రాజాపూర్‌, నవాబుపేట, గండీడ్‌, మహమ్మదాబాద్‌, హన్వాడ తదితర మండలాల్లో తేలకపాటి వర్షాలు కురవటంతో రైతులు పొలం పనుల్లో మునిగారు.

* జిల్లాలో ఈ ఏడాది వర్షాకాలంలో 3,77,917 ఎకరాల్లో పంటలు సాగు చేయనున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. మొక్కజొన్న 28,546 ఎకరాల్లో, పత్తి 1,15,845, వరి 1,89,917, జొన్న 13,015, కంది 12,548, ఆముదం 1565 ఎకరాల్లో సాగు చేయనున్నారని అంచనా వేస్తున్నారు. మందస్తుగా వ్యవసాయ శాఖ అధికారులు 95,305 మెట్రిక్‌ టన్నుల ఎరువులు అవసరమని గుర్తించారు. ఇప్పుడు 18,328 మెట్రిక్‌ టన్నుల డీఏపీ, 32,990 మెట్రిక్‌ టన్నుల యూరియా, 9,164 టన్నుల ఎంవోపీ, 27,429 టన్నుల కాంప్లెక్స్‌, 7,331 మెట్రిక్‌ టన్నుల ఎస్‌ఎస్‌పీ ఎరువులు ఉన్నాయి. వీటన్నింటిని రైతులకు సకాలంలో అందించనున్నామని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే మార్కెఫెడ్‌ ద్వారా ఎరువులు విక్రయిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని