logo

విద్యుత్తు మీటరు పొందాలంటే..

ఇల్లు కట్టుకుంటాం... విద్యుత్తు మీటరు ఎలా పొందాలో అవగాహన ఉండదు. ఏదైనా స్థిరాస్తి కొంటాం... విద్యుత్తు  మీటరు ఎలా మార్చుకోవాలో కొంత గందరగోళం.

Published : 07 Jun 2023 04:03 IST

కోస్గి న్యూటౌన్‌, న్యూస్‌టుడే : ఇల్లు కట్టుకుంటాం... విద్యుత్తు మీటరు ఎలా పొందాలో అవగాహన ఉండదు. ఏదైనా స్థిరాస్తి కొంటాం... విద్యుత్తు  మీటరు ఎలా మార్చుకోవాలో కొంత గందరగోళం. చాలామంది దళారులను ఆశ్రయించి అటు సమయాన్ని, ఇటు డబ్బును నష్టపోతుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలనేది తెలుసుకుందాం.

కొత్త మీటరుకు...

* స్థిరాస్తి రిజిస్ట్రేషన్‌ దస్తావేజుల నకలు ప్రతులు * పురపాలిక లేదా గ్రామపంచాయతీ అనుమతి పత్రాలు

* సంబంధిత యజమాని ఆధార్‌ కార్డు జెరాక్స్‌ కాపీ

* యజమానికి సంబంధించిన రెండు పాస్‌ఫొటోలు

* మీ ఏరియాలోని ఏదేని బ్యాంక్‌లో ‘డీఈఈ.ఓపీ..టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌.నారాయణపేట’ పేరుపై డీడీ తీయాలి.(ఏ జిల్లా అయితే ఆ జిల్లా పేరుతో డీడీ తీసుకోవాలి).

* ఒక కిలోవాట్‌కు క్యాటగిరీ-1 అయితే రూ.1650, క్యాటగిరీ-2 అయితే రూ.2275 చెల్లించాలి.

పేరు మార్చుకోవాలంటే...

* స్థిరాస్తి రిజిస్ట్రేషన్‌ దస్తావేజుల నకలు ప్రతులు * సంబంధిత యజమానుల ఆధార్‌కార్డు జెరాక్స్‌

* కొత్త యజమానికి సంబంధించిన రెండు పాస్‌ఫొటోలు

* వీటితో పాటు రూ.100 విలువైన బాండ్‌, ఆఫిడవిట్‌ను జతపరచాలి.

* పేరు మార్పుకోసం సంబంధితశాఖకు రూ.60 డీడీ చెల్లించాలి.


వారం రోజుల్లో పూర్తి చేస్తాం.

విద్యుత్తుశాఖ సూచించిన ధ్రువపత్రాలతో దరఖాస్తును ఉపకేంద్రంలో వినియోగదారుల సేవాకేంద్రానికి సమర్పించాలి. వారం రోజుల్లో ప్రాసెస్‌ పూర్తిచేసి, కొత్త మీటరు మంజూరు చేస్తాం. మీటరు పేరు మార్చుకోవడం కూడా సాధ్యమైనంత త్వరగా పూర్తి చేస్తాం.

సుధారాణి, ఏడీ, విద్యుత్తుశాఖ, కోస్గి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని