logo

ప్రతిభ చాటి జాతీయ స్థాయికి ఎదగాలి

రాష్ట్రస్థాయి షటిల్‌ బ్యాడ్మింటన్‌ పోటీల్లో తమలోని క్రీడా నైపుణ్యాలను ప్రదర్శించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికవ్వాలని షటిల్‌ బ్యాడ్మింటన్‌ సంఘం జిల్లా కార్యదర్శి రవి కుమార్‌ అన్నారు.

Published : 07 Jun 2023 04:03 IST

రాష్ట్రస్థాయికి ఎంపికైన క్రీడాకారులతో షటిల్‌ సంఘం జిల్లా కార్యదర్శి రవికుమార్‌

మహబూబ్‌నగర్‌ క్రీడలు, న్యూస్‌టుడే : రాష్ట్రస్థాయి షటిల్‌ బ్యాడ్మింటన్‌ పోటీల్లో తమలోని క్రీడా నైపుణ్యాలను ప్రదర్శించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికవ్వాలని షటిల్‌ బ్యాడ్మింటన్‌ సంఘం జిల్లా కార్యదర్శి రవి కుమార్‌ అన్నారు. మంగళవారం మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని మెసా ఇండోర్‌ స్టేడియంలో నిర్వహించిన ఉమ్మడి జిల్లా షటిల్‌ జట్ల ఎంపికలను ప్రారంభించి మాట్లాడారు. మూడేళ్లుగా కొవిడ్‌ కారణంగా పోటీలు నిర్వహించలేదన్నారు. గతేడాది పోటీలు జరిగినా ఆశించిన స్థాయిలో ప్రతిభ చాటలేకపోయారని పేర్కొన్నారు. ఈసారి సత్తాచాటాలని కోరారు. షటిల్‌ సంఘం కార్యనిర్వాహక కార్యదర్శులు సాదత్‌ఖాన్‌, బాల్‌రాజ్‌, ఎస్జీఎఫ్‌ కార్యదర్శి రమేశ్‌ బాబు, వాలీబాల్‌ సంఘం కార్యనిర్వాహక కార్యదర్శి చెన్నవీరయ్య, సంఘం సభ్యులు, సీనియర్‌ క్రీడాకారులు రామ్మోహన్‌ గౌడ్‌ పాల్గొన్నారు.

ఉమ్మడి జిల్లా జట్లు ఇవే.. : త్వరలో వివిధ జిల్లాల్లో నిర్వహించే రాష్ట్రస్థాయి షటిల్‌ బ్యాడ్మింటన్‌ పోటీల్లో పాల్గొనే ఉమ్మడి జిల్లా జట్లను ఎంపిక చేశారు. అండర్‌-13 సింగిల్స్‌లో శివశంకర్‌, శ్రీవిహాన్‌, డబుల్స్‌లో సాద్‌ హుసేన్‌, సయ్యద్‌ జైనుల్‌ ఆబెదీన్‌, బాలికల్లో దీక్ష సహస్ర, అనెం గ్లోరీ సుజాన్‌, డబుల్స్‌లో వైష్ణవి, దీక్ష సహస్ర చోటు సంపాదించారు. అండర్‌-15 సింగిల్స్‌లో జి.సంతోష్‌, జోయెల్‌ ప్రసూన్‌, డబుల్స్‌లో జోయెల్‌, సంతోశ్‌, బాలికల్లో ధ్రుతి సహస్ర, అండర్‌-17 బాలుర సింగిల్స్‌లో టి.సుమిత్‌ కుమార్‌, బాలికల సింగిల్స్‌లో ధృతి సహస్ర ఎంపికయ్యారు. అండర్‌- 19 సింగిల్స్‌లో ఎస్‌.శ్రీరాగ్‌, శివకృష్ణ, డబుల్స్‌లో అబ్దుల్‌ రహమాన్‌, ఎండీ అమాన్‌, సీనియర్స్‌ పురుషుల సింగిల్స్‌లో ఎస్‌.శ్రీరాగ్‌, సయ్యద్‌ అద్నాన్‌ అలి, డబుల్స్‌లో అబ్దుల్‌ రహమాన్‌, జీషాన్‌, 35 ఏళ్లకు పైబడిన విభాగంలో సయ్యద్‌ ఎజాజ్‌ అలి, వెంకటప్ప, డబుల్స్‌లో ఎండీ మహబూబ్‌అలి, వెంకటప్ప ఎంపికయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని