logo

గుప్త నిధుల తవ్వకాలు: ఎనిమిది మంది రిమాండు

అలంపూర్‌ పట్టణం పాపనాశి ఆలయ సమీపంలోని మబ్బుమఠంలో ఉన్న పురాతన ఆలయంలో శివలింగాన్ని చోరీ చేసిన ఘటనలో ఎనిమిది మందికి గురువారం రిమాండ్‌ విధించినట్లు ఎస్సై మహేందర్‌ తెలిపారు.

Published : 09 Jun 2023 04:04 IST

చోరీకి గురైన శివలింగం, అదుపులో నిందితులు

అలంపూర్‌, న్యూస్‌టుడే: అలంపూర్‌ పట్టణం పాపనాశి ఆలయ సమీపంలోని మబ్బుమఠంలో ఉన్న పురాతన ఆలయంలో శివలింగాన్ని చోరీ చేసిన ఘటనలో ఎనిమిది మందికి గురువారం రిమాండ్‌ విధించినట్లు ఎస్సై మహేందర్‌ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 4న ఏరువాక పౌర్ణమి సందర్భంగా ఆలయానికి పూజలు నిర్వహించేందుకు వెళ్లిన భక్తులకు శివలింగం కనిపించకపోవడంతో పోలీసులకు సమాచారం అందింది. పట్టణానికి చెందిన నాగమల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పరిశీలించినట్లు తెలిపారు. ర్యాలంపాడు వంతెన వద్ద ఇద్దరు వ్యక్తులు గురువారం అనుమానాస్పదంగా సంచరిస్తుండటంతో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ శివలింగం అడుగుభాగంలో గుప్త నిధులున్నాయనే అనుమానంతో కర్నూలు జిల్లా నందికొట్కూరుకు చెందిన నలుగురు, ఆత్మకూరుకు చెందిన నలుగురు  కలిసి శివలింగం చోరీ చేసినట్లు వెల్లడైంది. దీనిని తీసుకొస్తే పెద్ద మొత్తంలో డబ్బు అందుతుందని హైదరాబాద్‌కు చెందిన మోహన్‌రావు చెప్పడంతో చోరికి పాల్పడినట్లు నిందితులు అంగీకరించారు. కర్నూలు జిల్లా ఆత్మకూరులో కాశీ అనే వ్యక్తి ఇంట్లో దాచిన శివలింగాన్ని పోలీసులు తీసుకొచ్చారు. గుప్తనిధుల తవ్వకాలకు పాల్పడిన ఎనిమిది మంది (హర్ష, తిరుపాటి శేఖర్‌, నల్లబోతుల కాశీమ్‌, హనుమంతు, రామలింగం, ఆంజనేయులు, వెంకటేశ్వర్లు, రామకృష్ణ)తో పాటు ద్విచక్ర వాహనం, తవ్వకాలకు ఉపయోగించిన ఇనుప వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులని అలంపూర్‌ కోర్టులో రిమాండుకి తరలించిన్నట్లు ఎస్సై చెప్పారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని