logo

చంద్రబాబు అరెస్టును ఖండిస్తున్నాం : పట్నం నరేందర్‌రెడ్డి

మాజీ ముఖ్యమంత్రి, తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడిని ఎలాంటి నోటీసు లేకుండా అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నామని కొడంగల్‌ భారాస ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు.

Published : 21 Sep 2023 03:33 IST

కొడంగల్‌ ఎమ్మెల్యే మద్దతు కోరుతున్న తెదేపా నాయకులు

కోస్గి, న్యూస్‌టుడే: మాజీ ముఖ్యమంత్రి, తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడిని ఎలాంటి నోటీసు లేకుండా అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నామని కొడంగల్‌ భారాస ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు. బుధవారం కోస్గిలో వినాయక మండపాలను చూసి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం పురపాలక సంఘం కార్యాలయంలో అభివృద్ధి పనులపై అధికారులు, నాయకులతో చర్చించారు. ఈ సందర్బంగా తెదేపా మహబూబ్‌నగర్‌ లోక్‌సభ స్థానం కమిటీ ప్రధాన కార్యదర్శి అంబదాస్‌, నాయకులు నీలి రవి, వెంకట ప్రసాద్‌, డీకే రాములు కలిసి మద్దతు ఇవ్వాలని ఎమ్మెల్యేను కోరారు. చంద్రబాబు పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశారని, ఐటీ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని, అలాంటి వ్యక్తిపై కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేయడం సరికాదని ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని