logo

మహబూబ్‌నగర్‌లో ఎమ్‌ఎస్‌ఎఫ్‌ అధ్వర్యంలో ఆందోళన

ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశ పెట్టాలంటూ మహబూబ్ నగర్ న్యూ టౌన్ లో  ఎమ్‌ఎస్‌ఎఫ్‌ అధ్వర్యంలో ఆందోళన చేపట్టారు.

Published : 21 Sep 2023 14:36 IST

మహబూబ్‌నగర్‌ (విద్యావిభాగం) : ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశ పెట్టాలంటూ మహబూబ్ నగర్ న్యూ టౌన్ లో  ఎమ్‌ఎస్‌ఎఫ్‌ అధ్వర్యంలో ఆందోళన చేపట్టారు.   మహబూబ్ నగర్ లోని రాయచూర్ -హైదరాబాద్ రోడ్డుపై  రాస్తారోకో  చేశారు. పార్లమెంటు సమావేశాల్లో మొదటగా వర్గీకరణ బిల్లును చేర్చి ఆమోదింపజేసి ఎస్సీలకు న్యాయం చేయాలని ఎమ్‌ఎస్‌ఎఫ్‌ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సందే కార్తిక్ మాదిగ డిమాండ్ చేశారు.   ఈ పార్లమెంటు సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించి 29 ఏళ్ల మాదిగల సుదీర్ఘమైన పోరాటానికి న్యాయమైన ముగింపునివ్వాలని కోరారు.  కార్యక్రమంలో  సుధాకర్ మాదిగ,  నాగేందర్ మాదిగ,  సాంబ మాదిగ,  పంతీష్ మాదిగ,  నరసింహ మాదిగ,  వెంకటేష్ మాదిగ రాజ మాదిగ మాదిగ కిషోర్ మాదిగ మాదిగ శేఖర్ మాదిగ శ్రీనివాస్ మాదిగ తదితరులు  పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని