logo
Published : 27/11/2021 01:12 IST

దత్తత ప్రక్రియ పారదర్శకం అదనపు కలెక్టర్‌

సమావేశంలో మాట్లాడుతున్న రాజర్షి షా

సంగారెడ్డి టౌన్‌, న్యూస్‌టుడే: శిశుగృహ ద్వారా దత్తత ప్రక్రియ పారదర్శకంగా జరుగుతోందని అదనపు కలెక్టర్‌ రాజర్షి షా పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక శిశు గృహలో దత్తతకు దరఖాస్తు చేసుకున్న తల్లిదండ్రులతో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. కేంద్ర దత్తత నియమావళి-2017 ప్రకారం చట్టబద్ధమైన దత్తతకు ఇప్పుడు సులభతరం చేసినట్లు పేర్కొన్నారు. ఆరోగ్యవంతమైన పిల్లలను మాత్రమే దత్తత ప్రక్రియలోకి తీసుకొస్తామన్నారు. రెండు సంవత్సరాలుగా కరోన కారణంగా దత్తత ప్రక్రియలో జాప్యం జరిగిందని, ఇప్పుడు వేగవంతం చేసినట్లు పేర్కొన్నారు. జిల్లా సంక్షేమాధికారిణి పద్మావతి మాట్లాడుతూ.. దత్తత విషయంలో జిల్లా మొదటి స్థానంలో ఉందని తెలిపారు. కార్యక్రమంలో చిన్నపిల్లల వైద్యులు డా.చక్రపాణి, డీసీపీవో రత్నం తదితరులు పాల్గొన్నారు.

Read latest Medak News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని