Published : 27 Nov 2021 01:12 IST
ఇసుక తయారీ కేంద్రాలపై అధికారుల దాడులు
నీటి పైపుల దహనం
కంది, న్యూస్‌టుడే: మండలంలోని ఎర్దనూర్, బ్యాతోల్ పరిధి నక్కవాగు పరీవాహకంలో కృత్రిమ ఇసుక తయారీ తీరుపై ‘నక్కవాగులో ఆగని ఇసుక దందా’ శీర్షికన ‘ఈనాడు’లో శుక్రవారం కథనం ప్రచురితమైంది. స్పందించిన రెవెన్యూ అధికారులు నక్కవాగు పరీవాహకంలోని వివిధ ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. వాగులో ఏర్పాటు చేసిన మోటార్లను తొలగించి.. పైపులను దహనం చేశారు. రెండు ఇసుక ఫిల్టర్లను కూల్చివేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ సతీష్‌కుమార్ మాట్లాడుతూ.. ఇసుక తయారీపై నిఘా పెడతామన్నారు. తయారీదారుల్లో మార్పు రాకుంటే వాల్టా చట్టం కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ దాడుల్లో ఆర్ఐ సంతోష్‌కుమార్, వీఆర్ఓలు రాంచంద్రయ్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Tags :