logo
Published : 27/11/2021 01:12 IST

‘గౌరవెల్లి’కి మరో దఫా భూసేకరణ షురూ

రైతులకు చెక్కు అందిస్తున్న తహసీల్దార్‌ వేణుగోపాలరావు

అక్కన్నపేట(హుస్నాబాద్‌ గ్రామీణం), న్యూస్‌టుడే: అక్కన్నపేట మండలం గుడాటిపల్లి వద్ద నిర్మిస్తున్న గౌరవెల్లి ప్రాజెక్టుకు మిగిలిన 272 ఎకరాల భూసేకరణ మొదలైంది. ఇటీవల జిల్లా కేంద్రంలో పాలనాధికారి, ఎమ్మెల్యే సతీశ్‌కుమార్‌ సమక్షంలో జరిగిన చర్చలలో ఎకరాకు రూ.15 లక్షలు పరిహారంగా నిర్ణయించారు. ఈ మేరకు రైతులు ఒక్కొక్కరుగా భూములు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారు. శుక్రవారం దొడ్ల మల్లారెడ్డి, దొడ్ల రాజశేఖర్‌రెడ్డి తమ భూములను రెవెన్యూ అధికారులకు అప్పగిస్తున్నారు. వారికి చెందిన 17.12 ఎకరాల భూమిని ఇవ్వగా అందుకు పరిహారంగా రూ.2.56 కోట్ల చెక్కును అందించినట్లు తహసీల్దార్‌ వేణుగోపాలరావు తెలిపారు. మిగిలిన రైతులు ముందుకువచ్చి ప్రాజెక్టు పూర్తయ్యేందుకు సహకరించాలని కోరారు.

Read latest Medak News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని