logo
Published : 27/11/2021 01:12 IST

‘శాసించే స్థాయికి ఎదగాలి’

మాట్లాడుతున్న పీఎస్‌ఎన్‌ మూర్తి

మెదక్‌ టౌన్‌, న్యూస్‌టుడే: దళితులు, బహుజనులు రిజర్వేషన్లు కావాలని ఆశించే స్థాయి నుంచి శాసించే స్థాయికి ఎదగాలని విద్యార్థులకు ఇండియన్‌ డిఫెన్స్‌ అకాడమీ సర్వీస్‌ (ఐడీఏఎస్‌) మాజీ అధికారి పీ.ఎస్‌.ఎన్‌ మూర్తి సూచించారు. మెదక్‌లో శుక్రవారం డీబీఎఫ్‌ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన 72వ భారత రాజ్యాంగ దినోత్సవ స్ఫూర్తి సదస్సుకు ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. వేల సంవత్సరాల నుంచి మనుషులు అని మరిచిపోయి, అణచివేతకు గురై, అధికారానికి, అక్షరానికి దూరం చేసిన జాతిని అంబేడ్కర్‌ తలెత్తుకునేలా చేసిన రోజు నవంబరు 26 అని అన్నారు. ప్రతి ఒక్కరూ రాజ్యాంగ పఠనం చేయడం ద్వారా మీరు అనుకున్న లక్ష్యాలను నేరవేర్చుకుంటారన్నారు. వచ్చే సంవత్సరం రాజ్యాంగ దినోత్సవం రోజు వరకు రాజ్యాంగాన్ని పూర్తిగా కంఠస్తం చేసి నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పిన వారికి రూ. లక్ష నగదుతో పాటు మంచి కళాశాలలో న్యాయవాద కోర్సును చదివిస్తానని విద్యార్థులకు తెలిపారు. మెదక్‌ డీఎస్పీ సైదులు, డీబీఎఫ్‌ జాతీయ కార్యదర్శి శంకర్‌, డిప్యూటి స్టేట్‌ టాక్స్‌ అధికారి సుధాకర్‌, మెదక్‌ జిల్లా మైనింగ్‌ అసిస్టేంట్‌ డైరెక్టర్‌ జయరాజ్‌, ఓయూ పీహెచ్‌డీ విద్యార్థి భాస్కర్‌లు మాట్లాడారు.

Read latest Medak News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని