logo
Published : 27/11/2021 01:12 IST

నేడు, రేపు ఓటరు నమోదుకు.. ప్రత్యేక శిబిరాలు

పెద్దచింతకుంటలోని డిగ్రీ కళాశాలలో ఓటరు హెల్ప్‌లైన్‌ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకున్న విద్యార్థులు

న్యూస్‌టుడే, మెదక్‌: అర్హులైన వారు ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకునేలా ఎన్నికల సంఘం ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. ఈనెల 30 వరకు నమోదుకు అవకాశం కల్పించగా.. శని, ఆదివారాల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహించనున్నారు. జిల్లాలో 4.13 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వారిలో మహిళలు 2.12 లక్షల మంది, 2.01 లక్షల మంది పురుషులు. ఈనెల 1న ఎన్నికల సంఘం ముసాయిదా జాబితా ప్రకటించింది. వచ్చే ఏడాది జనవరి 5న తుది జాబితా ప్రకటించనున్న నేపథ్యంలో నమోదు కార్యక్రమం చేపడుతున్నారు. ప్రస్తుతం ఉన్న జాబితాలో మార్పుచేర్పులతో పాటు 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ నమోదు చేసుకోవచ్ఛు ఇటీవల ప్రకటించిన ముసాయిదా జాబితా ప్రకారం గ్రామ, పట్టణ స్థాయిలో బీఎల్‌ఓలు, రెవెన్యూ అధికారులు సమన్వయంతో దరఖాస్తులు స్వీకరించారు. ఈమేరకు ఆయా కేటగీరిల వారీగా 4,765 వచ్చాయి.

అంబాసిడర్ల నియామకం: ఎన్నికల సంఘం డిగ్రీ కళాశాలల్లో క్యాంపస్‌ అంబాసిడర్లను నియమించింది. ఈమేరకు జిల్లావ్యాప్తంగా 30 మంది అంబాసిడర్లుగా నియమితులయ్యారు. వీరు తమ కళాశాల పరిధిలో ఓటరు నమోదుపై అవగాహన కల్పిస్తారు. 18 ఏళ్లు నిండిన వారి చేత నమోదు చేయించనున్నారు. ఇందుకు చరవాణుల్లో ఓటరు హెల్ప్‌లైన్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేయిస్తున్నారు. ప్రస్తుతం కళాశాలలల్లో అవగాహన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈనెల 27, 28న ప్రత్యేక కార్యాచరణ చేపట్టనున్నారు. జిల్లాలో 576 పోలింగ్‌బూత్‌లు ఉన్నాయి. అంగన్‌వాడీ సిబ్బంది, వీఆర్‌ఏలు, మెప్మా రిసోర్స్‌పర్సన్లు బూత్‌స్థాయి అధికారులుగా వ్యవహరిస్తున్నారు. రెండు రోజులు సిబ్బంది అందుబాటులో ఉండి దరఖాస్తులు స్వీకరిస్తారు. అలాగే ఈనెల 30 వరకు ఓటరు నమోదుకు అవకాశం కల్పించారు. డిసెంబరు 20 నాటికి జాబితా సవరణ, జనవరి 5వ తేది నాటికి తుది జాబితా విడుదల చేయనున్నట్లు అధికారులు వివరించారు. ‘బీఎల్‌ఓలు, వీఆర్‌ఏలను సంప్రదించి దరఖాస్తులు ఇవ్వొచ్చని ’ జిల్లా పర్యవేక్షక అధికారి రాజిరెడ్డి తెలిపారు.

Read latest Medak News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని