logo
Published : 29/11/2021 01:32 IST

కొనుగోళ్లు కొండంత.. చెల్లింపులు గోరంత

నగదుకు నిరీక్షిస్తున్న ధాన్యం విక్రయించిన రైతులు

గజ్వేల్‌లో కొనసాగుతున్న ధాన్యం కొనుగోళ్లు

న్యూస్‌టుడే, గజ్వేల్‌, సిద్దిపేట టౌన్‌: కల్లాల వద్ద ఎదురు చూపుల అనంతరం ఎట్టకేలకు ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయి. అనంతరం నగదు చెల్లింపులు సకాలంలో చేయక పోవటంతో వారి నిరీక్షణకు అంతులేకుండా పోయింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను విక్రయించడం అన్నదాతలకు ప్రహసనంగా మారుతోంది. తరలొచ్చిన కాళేశ్వరం నీళ్లు, కలిసొచ్చిన కాలంతో జిల్లాలో పుష్కలంగా ఉన్న నీటి లభ్యత కారణంగా రైతులు మునుపెన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో 3.17 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. దీంతో సీజన్‌లో మొత్తం సుమారు 8 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. క్వింటాలుకు రూ.1960 మద్దతు ధరకు ధాన్యం సేకరించి దన్నుగా నిలవాలని భావించిన ప్రభుత్వం జిల్లాలో 412 కేంద్రాలను ఏర్పాటు చేసింది. వాటి ద్వారా ఆదివారం వరకు 30,555 మంది రైతుల నుంచి రూ.265,94,84,800 విలువైన 1,35,688 టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. అంతవరకు బాగానే ఉన్నా రైతులకు చెల్లించిన మొత్తం చూస్తే రూ.96 కోట్లు మాత్రమే. ధాన్యం విక్రయించిన తరువాత నాలుగు రోజుల్లోపు మీ బ్యాంకు ఖాతాల్లో నగదు జమ అవుతుందని రైతులకు అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో  వారం రోజులు గడచినా ఖాతాల్లో నగదు జమ కావడం లేదని వారు వాపోతున్నారు. ఈ విషయమై జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి హరీశ్‌ను ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా.. వర్షాల కారణంగా కొనుగోళ్లకు కాస్త ఇబ్బంది నెలకొనగా సాధ్యమైంత మేర వేగంగా సాగిస్తున్నామన్నారు. రైతుల ఖాతాల్లో నగదు జమ చేసే విషయంలో వారి చరవాణులకు వస్తున్న ఓటీపీని సకాలంలో చెప్పక పోవడంతో నగదు ఆలస్యంగా జమ అవుతోందని అన్నారు.

Read latest Medak News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని