logo
Published : 29/11/2021 01:31 IST

గోపాలకృష్ణపురంలో బృందావనం!

చ్చని చెట్లు ప్రగతికి మెట్లు.. ఆరోగ్యానికి శ్రీరామ రక్ష అనేది అనుభవ పూర్వకంగా అందరికీ తెలుసు. పచ్చదనం పెంపు కోసం ప్రభుత్వం హరిత హారం కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపడుతోంది. పల్లె ప్రకృతి వనాలు, బృహత్‌ పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేస్తోంది. వాతావరణ కాలుష్యం తగ్గి స్వచ్ఛమైన ప్రాణవాయువు లభిస్తుంది. మాసాయిపేట మండలంలోని గోపాలకృష్ణపురం గ్రామం పచ్చందాల వనంగా దర్శనమిస్తోంది. కేవలం 30 నివాస గృహాలున్న ఈ పల్లె పక్కనే హల్దీ జలాశయం ఉంది. పొలాలు, తోటలు, కూరగాయల చేన్లు ఉండటమే కాకుండా ప్రతి ఇల్లూ పచ్చదనంతో కనువిందు చేస్తాయి. ఇళ్ల ఆవరణల్లో గులాబి, మందారం, చామంతి, మల్లి, గన్నేరు ఇలా రకరాలు పూల మొక్కలు కనిపిస్తాయి. మామిడి, జామ, అరటి, బొప్పాయి, నేరేడు, సపోట, అల్లనేరేడు, బత్తాయి, దానిమ్మ పండ్ల చెట్లు ఉంటాయి. పల్లెవాసులెవరూ కూరగాయలు, పండ్లు కొనుగోలు చేయరు. అరవై ఏళ్ల క్రితం ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడే భూములు కొని వ్యవసాయం చేస్తూ స్థిరపడ్డారు. వీరు నాటు కోళ్లు, పాడి పశువులు పెంచుతారు. ఏ ఇంటికి వెళ్లినా మజ్జిగ అందిస్తూ మర్యాదలు చేయడం విశేషం. 

 - న్యూస్‌టుడే, వెల్దుర్తి

Read latest Medak News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని