logo
Published : 29/11/2021 01:31 IST

నేడు దుబ్బాక బంద్‌కు పిలుపు

ర్యాలీగా బయలుదేరిన దళిత సంఘాల నాయకులు

న్యూస్‌టుడే - దుబ్బాక, మిరుదొడ్డి: భారత రాజ్యాంగం, దాని నిర్మాత అంబేడ్కర్‌పై అనుచిత వ్యాఖ్యలతో కూడిన పోస్టింగ్‌ను సామాజిక మాధ్యమాల్లో పెట్టిన వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం దుబ్బాక పట్టణ బందుకు పిలుపునిస్తున్నామని దళిత సంఘాల ఐక్యకార్యాచరణ సమితి (జేఏసీ) ప్రకటించింది. వర్తక, వాణిజ్య, విద్యా సంస్థలు, దుకాణదారులు ఇందుకు సహకరించాలని జేఏసీ నేతలు కోరారు.

ఇంటి ముట్టడికి యత్నం.. ఠాణాకు నేతల తరలింపు
దుబ్బాక పట్టణంలో ఆదివారం ఉదయం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పట్టణానికి చెందిన నల్ల శ్రీనివాస్‌ అనే వ్యాపారి రెండు రోజుల క్రితం సామాజిక మాధ్యమాలో పోస్టింగ్‌ పెట్టడంపై దళిత సంఘాలు భగ్గుమన్నాయి. ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయకుండా పోలీసులు జాప్యం చేస్తున్నారని ఆరోపిస్తూ, ఆదివారం అతని ఇంటి ముట్టడికి దళిత సంఘాల నాయకులు పిలుపు నిచ్చారు. దీంతో పోలీసులు అతని ఇంటితో పాటు, పట్టణంలోని పలు కూడళ్లలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ర్యాలీ తల్లి తెలంగాణ చౌరస్తాకు చేరుకోగానే, పోలీసులు అడ్డుకున్నారు. నాయకులను అదుపులోకి తీసుకొని, మిరుదొడ్డి, భూంపల్లి ఠాణాలకు తరలించారు. సిద్దిపేట ఏసీపీ దేవారెడ్డి ఆధ్వర్యంలో సిద్దిపేట సీఐలు పరశురాంగౌడ్‌, ప్రవీణ్‌, ఎస్‌ఐలు మన్నె స్వామి, సర్దార్‌ జమాల్‌, శ్రీనివాస్‌, మరో 50 మంది సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు. న్యాయ సలహా తీసుకొని తదుపరి చర్యలు తీసుకుంటామని ఏసీపీ చెప్పారు. ర్యాలీ తీస్తుంటే పోలీసులు అడ్డుకోవడాన్ని ఖండిస్తున్నామని పట్టణ తెరాస అధ్యక్షుడు పల్లె వంశీకృష్ణగౌడ్‌ మాట్లాడుతూ అన్నారు. రాజ్యాంగ స్పూర్తితో ప్రతి ఒక్కరు మెలగాలని దళిత, బహుజన ఐక్యకార్యాచరణ కమిటీ ఛైర్మన్‌ ర్యాకం శ్రీరాములు పేర్కొన్నారు. మిరుదొడ్డి ఠాణాలో పోలీసుల తీరుకు నిరసనగా ఆందోళన చేశారు. శ్రీనివాస్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతినిధులు ఆస స్వామి, ఇల్లెందుల శ్రీనివాస్‌, రాజేశం తదితరులున్నారు. పోలీసులు తెచ్చిచ్చిన భోజనాన్ని స్వీకరించడానికి వారు నిరాకరించారు. అనంతరం అర్ధనగ్న ప్రదర్శన చేశారు. విషయం తెలుసుకున్న సీఐ అక్కడికి వచ్చి నచ్చజెప్పారు. సాయంత్రం వారిని విడిచిపెట్టారు.


అంబేడ్కర్‌ నాకు దేవుడు: నల్ల శ్రీనివాస్‌

విగ్రహానికి పూలమాల వేస్తున్న వ్యాపారి నల్ల శ్రీనివాస్‌

భారత రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్‌.అంబేడ్కర్‌ తనకు దేవుడని.. సామాజిక మాధ్యమాల్లో వచ్చిన అనుచిత వ్యాఖ్యలను సరిగా పరిశీలించకుండా ఇతర గ్రూప్‌లకు పంపానని.. ఇందుకు క్షమాపణ కోరుతున్నానని వ్యాపారి నల్ల శ్రీనివాస్‌ అన్నారు. ఈమేరకు ఆయన ఆదివారం రాత్రి దుబ్బాక పట్టణంలోని అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి, పాదాభివందనం చేశారు.

Read latest Medak News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని