logo
Published : 29/11/2021 01:31 IST

కాంగ్రెస్‌ హయాంలో స్థానిక సంస్థలకు నిధులు: జగ్గారెడ్డి

మాట్లాడుతున్న పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి

నారాయణఖేడ్‌, న్యూస్‌టుడే: స్థానిక నేతలను కలవడానికి ఇష్టపడని మంత్రి హరీశ్‌రావు కాంగ్రెస్‌ అభ్యర్థిని బరిలోకి దింపగానే ఇంటింటికీ ఫోన్లు చేస్తున్నారని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి ఆరోపించారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఆదివారం ఖేడ్‌లో నిర్వహించిన ప్రజాప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో కాంగ్రెస్‌ అభ్యర్థిని ఎమ్మెల్సీగా గెలిపిస్తే కేసీఆర్‌ స్థానిక నేతలకు ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు నిధులు విడుదల చేస్తారన్నారు. కాంగ్రెస్‌ హయాంలో స్థానిక సంస్థలకు దండిగా నిధులు మంజూరు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. సంగారెడ్డి-నాందేడ్‌-అకోలా జాతీయ రహదారి విస్తరణ మంజూరు, నిధుల కేటాయింపు కాంగ్రెస్‌ హయాంలోనే జరిగిందన్నారు. ఉన్న 230 ఓట్లతోపాటు తెరాస నేతలు వస్తే వారితోకూడా కాంగ్రెస్‌ అభ్యర్థికి ఓట్లు వేయించాలని కోరారు. టీపీసీసీ ఉపాధ్యక్షులు సురేష్‌శెట్కార్‌, సభ్యులు సంజీవరెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు భోజిరెడ్డి, పురపాలిక కాంగ్రెస్‌ ఫ్లోర్‌లీడర్‌ ఆనంద్‌స్వరూప్‌శెట్కార్‌ పాల్గొన్నారు.

Read latest Medak News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని