logo
Published : 29/11/2021 01:31 IST

నిర్మాణం సరే.. ప్రారంభం మరి..?

విద్యార్థినులకు సౌకర్యంగా ఉండేలా నిర్మాణం చేపట్టిన వసతిగృహం ప్రారంభోత్సవానికి నిరీక్షిస్తోంది. చేగుంటలోని తెలంగాణ ఆదర్శ పాఠశాల, జూనియర్‌ కళాశాల ఆవరణలో రూ.90 లక్షల వ్యయంతో బాలికల వసతిగృహ నిర్మాణానికి మూడేళ్ల క్రితం అప్పటి విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి శంకుస్థాపన చేశారు. ఏళ్ల తర్వాత ఎట్టకేలకు నిర్మాణ పనులు పూర్తి చేసినా ఇంత వరకు ప్రారంభించలేదు. రోజులు గడుస్తున్నా ప్రారంభం విషయంలో అధికారులు కాలయాపన చేస్తున్నారనే ఆరోపణలూ ఉన్నాయి. ఇందులో ఇంటర్మీడియట్‌ చదువుకుంటున్న వంద మంది విద్యార్థినులను చేర్చుకుంటారు. ఒకవేళ ఇంటర్‌ విద్యార్థినులు లేకపోతే పదో తరగతి బాలికలకు అవకాశం కల్పిస్తారు. జిల్లాలో రామాయంపేట, చిన్నశంకరంపేట, నర్సాపూర్‌, టేక్మాల్‌లో వసతిగృహాలను ఇంతకుముందే నిర్మించారు. రేగోడ్‌లో ఇంకా వసతిగృహ భవన నిర్మాణ పనులు చేపట్టడంలేదు. చేగుంటలో నిర్మించిన దానిని ప్రారంభిస్తే దూరప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థినులకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది.

- న్యూస్‌టుడే, చేగుంట

Read latest Medak News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని