logo
Published : 02/12/2021 03:54 IST

ప్రయాణంలో పారాహుషార్‌!

రాయపోల్‌ మండలం రామారం పాఠశాల సమీపంలో..
 

కోహెడ, శనిగరం దారిలో..

న్యూస్‌టుడే - రాయపోల్‌, కోహెడ, రేగోడ్‌, పెద్దశంకరంపేట, చేర్యాల, ములుగు, బెజ్జంకి, వెల్దుర్తి, హుస్నాబాద్‌ గ్రామీణం, చేగుంట, జహీరాబాద్‌ అర్బన్‌: రోడ్డు పక్కన ఉన్న బావులు రాకపోకలు సాగించేవారిని భయపెడుతున్నాయి. ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా నేరుగా వాహనంతో సహా బావుల్లో పడిపోతున్నారు. ప్రాణాలు పోతున్నాయి. ప్రస్తుతం బావులన్నీ పూర్తిగా నీటితో నిండి ఉన్నాయి. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో అనేక చోట్ల రహదారి పక్కన వాహనదారులు సులభంగా గుర్తించలేని స్థితిలో ప్రమాదకరంగా బావులున్నాయి. వాటిని పూడ్చి వేయడమో, రోడ్డుకు రెండు వైపులా రక్షణ నిర్మాణాలు చేపట్టడమో జరగాలని ప్రజలు కోరుతున్నారు.

జూకల్‌లో..

ఎక్కడెక్కడ..
రాయపోల్‌ మండలం రామారం, అప్పాయిపల్లి గ్రామాలు.. సిద్దిపేట-హుస్నాబాద్‌ దారి బస్వాపూర్‌ శివారులో.. రేగోడ్‌ నుంచి కార్కంచతండా, మర్పల్లిలో.. పెద్దశంకరంపేట-మెదక్‌ రోడ్డులో జూకల్‌ గ్రామ శివారు వద్ద.. కొమురవెల్లి మండలం రసూలాబాద్‌, ఐనాపూర్‌ గ్రామాల సమీపంలో.. రాజీవ్‌ రహదారి ములుగు మండలం అన్నాసాగర్‌లో.. బెజ్జంకి నుంచి చీలాపూర్‌పల్లికి వెళ్లు మార్గంలో బావులు ఉన్నాయి. వెల్దుర్తి మండలం ఉప్పులింగాపూర్‌ వద్ద హల్దీవాగు వంతెన ప్రమాదకరంగా మారింది. హుస్నాబాద్‌ నుంచి అక్కన్నపేట వెళ్లే రహదారిలో.. చేగుంట నుంచి గజ్వేల్‌కు వెళ్లే మార్గంలో కర్నాల్‌పల్లి ఎల్లమ్మ దేవాలయం సమీపంలో బావులు, గుంతలు ఉన్నాయి.
* రహదారి అంచున పురాతన వ్యవసాయ బావితో ప్రమాదం పొంచి ఉందని జహీరాబాద్‌ మండలం రాయిపల్లి(డి)-ఝరాసంగం మండలం బిడకన్నె గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇది పగటిపూట కన్పిస్తున్నా... రాత్రివేళల్లో ఆదమరిస్తే ప్రాణాలు పోయే అవకాశముందని జంకుతున్నారు. సంబంధిత అధికారులు దృష్టి సారించి రక్షణ గోడ నిర్మించడమైనా.. లేదా పూడ్చి వేయడమైనా చేయాలని బాటసారులు కోరుతున్నారు.

 


హల్దీవాగుపై రక్షణలేని ఉప్పులింగాపూర్‌ వంతెన

Read latest Medak News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని