logo
Published : 02/12/2021 04:10 IST

భర్త రావడం లేదని దివ్యాంగురాలు ఆత్మహత్య

రాయపోల్‌, న్యూస్‌టుడే: భర్త కాపురానికి రావడం లేదని జీవితంపై విరక్తి చెందిన దివ్యాంగురాలు ఆత్మహత్య చేసుకున్న ఘటన రాయపోల్‌ మండలం మంతూరులో జరిగింది. ఎస్‌ఐ మహబూబ్‌ తెలిపిన వివరాలు.. మంతూరు గ్రామానికి చెందిన పడిగె సత్తయ్య, శ్యామవ్వ దంపతులకు ఇద్దరు కూతుళ్లు. చిన్న కూతురు బాలలక్ష్మి(22)కి పుట్టుకతోనే కుడి కాలు, చెయ్యి సరిగా లేవు. ఏడాది క్రితం తిర్మలాపూర్‌ గ్రామానికి చెందిన స్వామిని ఇల్లరికం తెచ్చుకున్నారు. మూడు నెలల తర్వాత స్వామి సొంతూరికి వెళ్లి తిరిగి రాలేదు. చరవాణి ద్వారా భర్తను సంప్రదించినా ఫలితం లేకపోవడంతో ఆవేదనకు గురైన బాలలక్ష్మి మంగళవారం రాత్రి పురుగుల మందు తాగింది. కుటుంబ సభ్యులు గమనించి హైదరాబాద్‌ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. తండ్రి సత్తయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

శాలిపేటలో అన్నదాత...
చిన్నశంకరంపేట: ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఓ రైతు ఉరి వేసుకున్నాడు. ఈ ఘటన చిన్నశంకరంపేట మండలం శాలిపేటలో బుధవారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ గౌస్‌ తెలిపిన వివరాలు.. శాలిపేటకు చెందిన శ్రీను(38) వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతనికి భార్య, ఇద్దరు కుమారులున్నారు. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉందని, భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ చెప్పారు.

Read latest Medak News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని