logo
Published : 02/12/2021 04:10 IST

అల్లుడు దాడి.. మామ మృతి

చేగుంట, న్యూస్‌టుడే: అల్లుని వరుసైన వ్యక్తి దాడి చేయడంతో మామ మృతి చెందిన ఘటన మెదక్‌ జిల్లా చేగుంట మండలం బోనాలలో బుధవారం జరిగింది. ఎస్‌ఐ సుభాష్‌గౌడ్‌ తెలిపిన వివరాలు.. బోనాల గ్రామానికి చెందిన కెంగెర్ల మల్లయ్య (55) కుమార్తె లక్ష్మిని పులిమామిడికి చెందిన రాములుతో వివాహం జరిపించాడు. లక్ష్మి మరిది మండ్ల రాజు తరచూ అన్నావదినతో గొడవ పడుతున్నాడు. మంగళవారం మళ్లీ గొడవ జరిగింది. మనవడు ఫోన్‌లో సమాచారం ఇవ్వగా మల్లయ్య పులిమామిడికి వెళ్లి రాజును మందలించాడు. ఆవేశంతో మల్లయ్య ఛాతి, కడుపుపై రాజు తీవ్రంగా కొట్టాడు. గాయపడిన మామను రామాయంపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించి ఇంటికి తీసుకొచ్చారు. బుధవారం ఛాతిలో నొప్పి వచ్చింది. రామాయంపేట ఆసుపత్రికి తీసుకెళ్లేసరికి మృతి చెందాడు. అతని కుమారుడు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.

Read latest Medak News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని