logo

వారసత్వ రాజకీయాలకు భాజపా దూరం

ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడితే 2023లో తెలంగాణలో భాజపా ప్రభుత్వం వస్తుందని ఆ పార్టీ సీనియర్‌ నాయకుడు, మధ్యప్రదేశ్‌ ఇన్‌ఛార్జి ఎం.మురళీధర్‌రావు పేర్కొన్నారు. కందిలోని ఓ

Published : 08 Dec 2021 05:04 IST

పార్టీ మధ్యప్రదేశ్‌ రాష్ట్ర ఇన్‌ఛార్జి మురళీధర్‌రావు

కార్యకర్తల శిక్షణ శిబిరంలో ప్రసంగిస్తున్న మురళీధర్‌రావు

కంది, న్యూస్‌టుడే: ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడితే 2023లో తెలంగాణలో భాజపా ప్రభుత్వం వస్తుందని ఆ పార్టీ సీనియర్‌ నాయకుడు, మధ్యప్రదేశ్‌ ఇన్‌ఛార్జి ఎం.మురళీధర్‌రావు పేర్కొన్నారు. కందిలోని ఓ ఫంక్షన్‌ హాలులో మూడు రోజులుగా కొనసాగుతున్న జిల్లాస్థాయి శిక్షణ తరగతుల చివరి రోజు మంగళవారం ఆయన హాజరై ప్రసంగించారు. జిల్లా కార్యవర్గ సభ్యులకు దిశానిర్దేశం చేశారు. ఇప్పటి వరకు దేశంలో 130 కోట్ల డోసుల వ్యాక్సిన్‌ అందించిన ఘనత కేంద్ర ప్రభుత్వానికి దక్కిందన్నారు. దేశంలో వారసత్వ రాజకీయాలు లేకుండా ఒక్క భాజపా మాత్రమే పని చేస్తుందన్నారు. వారసత్వ రాజకీయాలను వ్యతిరేకించే ధైర్యం తెరాసకు, అవినీతిపై పోరాటం చేసే సత్తా కాంగ్రెస్‌కు ఉన్నాయా అని ఆయన ప్రశ్నించారు. తెరాస, కాంగ్రెస్‌ రెండు ఒక్కటేనన్నారు. ఓటరుకు మనపై నమ్మకం కలిగేలా వ్యవహరించాలని, భాజపా కులం, మతం సంబంధం లేకుండా అందరి సంక్షేమం కోసం పని చేస్తుందని ఆయన వివరించారు. మాజీ ఎమ్మెల్యేలు బాబుమోహన్‌, నందీశ్వర్‌గౌడ్‌, విజయ్‌పాల్‌రెడ్డి, భాజపా జిల్లా అధ్యక్షులు నరేందర్‌రెడ్డి, సంగారెడ్డి జిల్లా ఇన్‌ఛార్జి బొమ్మ జయశ్రీ, జగన్‌, విష్ణువర్ధన్‌రెడ్డి, రాజేశ్వర్‌రావు దేశ్‌పాండే తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని