logo

79 రోజులు.. రూ.11.09 లక్షల జరిమానా

నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై రవాణా శాఖ అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. మితిమీరిన వేగం, పరిమితికి మించి ప్రయాణికులను తరలించడం, సరియైన ధ్రువపత్రాలు లేని వారికి జరిమానాలు విధిస్తున్నారు. కరోనా వేళ లాక్‌డౌన్‌ను ప్రత్యేక సందర్భంగా గుర్తిస్తూ సరకు, ప్రజా రవాణా వాహనాల ఫిట్‌నెస్‌, పర్మిట్ల పునరుద్ధరణకు

Published : 20 Jan 2022 01:28 IST

న్యూస్‌టుడే, మెదక్‌ అర్బన్‌

 
వాహనదారులకు జరిమానా విధిస్తున్న ఏఎంవీఐ సైదా, చిత్రంలో ఆర్టీసీ డీఎం ప్రణీత్‌ కుమార్‌

నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై రవాణా శాఖ అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. మితిమీరిన వేగం, పరిమితికి మించి ప్రయాణికులను తరలించడం, సరియైన ధ్రువపత్రాలు లేని వారికి జరిమానాలు విధిస్తున్నారు. కరోనా వేళ లాక్‌డౌన్‌ను ప్రత్యేక సందర్భంగా గుర్తిస్తూ సరకు, ప్రజా రవాణా వాహనాల ఫిట్‌నెస్‌, పర్మిట్ల పునరుద్ధరణకు కేంద్రం 2020 ఫిబ్రవరి 1 నుంచి 2021 అక్టోబర్‌ 30 వరకు (ఎక్స్‌టెన్షన్‌ ఆఫ్‌ వ్యాల్యూయేషన్‌) వెసులుబాటు కల్పించిన విషయం తెలిసిందే. గడువు ముగిసిన పలువురు వాహనదారులు వీటికి దూరంగా ఉంటుండడం, సరియైన పత్రాలు లేకుండా, రోడ్డు భద్రతా నియమాలు పాటించకుండా ఉండడం వంటి తదితర అంశాలపై రవాణా శాఖ అప్రమత్తమై విస్తృత తనిఖీలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు 2021 నవంబర్‌, డిసెంబర్‌ నెలల్లో రవాణా శాఖ, ఆర్టీసీతో సంయుక్తంగా ప్రత్యేక తనిఖీలు నిర్వహించి ఫిట్‌నెస్‌ పొందని, ఓవర్‌ లోడ్‌, సరైన పత్రాలు లేని వాహనాలు జప్తు చేసి తదనుగుణంగా జరిమానాలు విధించారు. ఈ రెండు నెలల్లో నిర్వహించిన తనిఖీల్లో విధించిన జరిమానాల ద్వారా రూ.10,38,837 సొమ్ము రాగా ఈనెల 18 వరకు జరిపిన తనిఖీల్లో రూ.70,305 డబ్బు సమకూరిందని, మొత్తం రూ.11,09,142 వచ్చిందని జిల్లా రవాణా శాఖ అధికారి జి.వి. శ్రీనివాస్‌ గౌడ్‌ తెలిపారు. వాహనాలకు సంబంధించిన ధ్రువపత్రాలు వెంట ఉండాలని, ప్రతి వాహనదారుడు విధిగా సకాలంలో అనుమతులు పొందాలని, రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని సూచించారు. లేకపోతే తనిఖీల్లో పట్టుబడిన వాహనాలను సీజ్‌ చేసి కోర్టుకు అప్పగిస్తామని, తదనుగుణంగా జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు.


తనిఖీల్లో విధించిన జరిమానా ఇలా..

వాహనాలు నవంబర్‌ డిసెంబర్‌ జనవరి(18 వరకు)

ఆటో రిక్షా 2,64,212 5,14,435 47,275

లారీ.. 1,23,955 98,400 16,000

కారు 3,225 7,025 2,030

ట్రాక్టరు, తదితరాలు 2,000 25,585 5,000


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని