logo

ఎవరూ లేక.. పట్టించుకోక..!

అందరూ ఉన్నా అవసరానికి ఒక్కరూ అందుబాటులో ఉండరు అన్న చందంగా మారింది చిలప్‌చెడ్‌ వ్యవసాయ శాఖ అధికారుల తీరు. ఇక్కడ వ్యవసాయ శాఖ అధికారులుగా పని చేసిన ఏవో, ఇద్దరు ఏఈవోలు జోనల్‌ బదిలీల్లో భాగంగా బదిలీపై ఇతర జిల్లాలకు వెళ్లగా వేరే ప్రాంతాల నుంచి ఇద్దరు ఏఈవోలు, ఏవో బదిలీపై ఇక్కడికి వచ్చి బాధ్యతలు చేపట్టారు.

Published : 20 Jan 2022 01:28 IST

అధికారులు కరవై అన్నదాతల అవస్థలు

న్యూస్‌టుడే, చిలప్‌చెడ్‌


ఖాళీ కుర్చీలతో వ్యవసాయ కార్యాలయం

అందరూ ఉన్నా అవసరానికి ఒక్కరూ అందుబాటులో ఉండరు అన్న చందంగా మారింది చిలప్‌చెడ్‌ వ్యవసాయ శాఖ అధికారుల తీరు. ఇక్కడ వ్యవసాయ శాఖ అధికారులుగా పని చేసిన ఏవో, ఇద్దరు ఏఈవోలు జోనల్‌ బదిలీల్లో భాగంగా బదిలీపై ఇతర జిల్లాలకు వెళ్లగా వేరే ప్రాంతాల నుంచి ఇద్దరు ఏఈవోలు, ఏవో బదిలీపై ఇక్కడికి వచ్చి బాధ్యతలు చేపట్టారు. కానీ విధులు నిర్వహించడం లేదు. అధికారులు అందుబాటులో లేకపోవడంతో వివిధ సమస్యల నిమిత్తం కార్యాలయానికి వచ్చే అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. మండలంలో రెండు క్లస్టర్లు ఉండగా బదిలీల్లో భాగంగా కొల్చారం నుంచి ఏవో బాల్‌రెడ్డితో పాటు ఇతర ప్రాంతాల నుంచి ఇద్దరు ఏఈవోలు వచ్చారు. ఇందులో చిట్కుల్‌ క్లస్టర్‌ ఏఈవో ప్రసవ సెలవులో ఉండగా, చిలప్‌చెడ్‌ క్లస్టర్‌ ఏఈవో కరోనా బారిన పడి విధులకు రాలేకపోతున్నారు. ఇక ఏవో బాల్‌రెడ్డి సైతం విధులకు రాకపోవడంతో కార్యాలయంలో ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నాయి. దీంతో రెండు క్లస్టర్ల పరిధిలోని 19 గ్రామాలకు చెందిన రైతులు కార్యాలయానికి వచ్చి వెనుదిరుగుతున్నారు. వారం రోజులుగా ఇదే పరిస్థితి ఉందని, అయినా ఎవరూ పట్టించుకోవడం లేదని అన్నదాతలు వాపోతున్నారు.


వారం రోజులుగా తిరుగుతున్నా..

- భూమేశ్‌, రైతు, జగ్గంపేట

మాకు రైతుబంధు నగదు రాకపోవడంతో వివరాలు తెలుసుకునేందుకు వారం రోజులుగా వ్యవసాయ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాను. ఇక్కడ ఎవరూ ఉండటం లేదు. ఇలా అయితే సమస్యలు ఎలా పరిష్కరిస్తారు.


ఇన్‌ఛార్జులను నియమిస్తాం..

- పరశురాంనాయక్‌, డీఏవో

చిలప్‌చెడ్‌లో వ్యవసాయ శాఖ అధికారులు అందుబాటులో లేక రైతులు ఇబ్బందులు పడుతున్న విషయం మా దృష్టికి వచ్చింది. ఇతర మండలాల నుంచి ఇన్‌ఛార్జులను నియమించేందుకు చర్యలు తీసుకుంటాం. ఏవో బాల్‌రెడ్డి ఇక్కడ ఇన్‌ఛార్జిగా ఉన్నారు. మరో అధికారిని నియమించేలా చూస్తాం.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని