logo

బురదలో పడి ఊపిరాడక ఒకరు..

పొలం గట్టుపై నుంచి జారి బురదలో పడి ఊపిరాడక ఒకరు మృతిచెందిన ఘటన మెదక్‌ జిల్లా కౌడిపల్లి మండలం మహ్మద్‌నగర్‌ గ్రామంలో బుధవారం వెలుగు చూసింది. ఎస్‌ఐ శివప్రసాద్‌రెడ్డి తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన కుమ్మరి నర్సింహులు (50) వ్యవసాయం చేస్తూ

Published : 20 Jan 2022 01:28 IST

కౌడిపల్లి, న్యూస్‌టుడే: పొలం గట్టుపై నుంచి జారి బురదలో పడి ఊపిరాడక ఒకరు మృతిచెందిన ఘటన మెదక్‌ జిల్లా కౌడిపల్లి మండలం మహ్మద్‌నగర్‌ గ్రామంలో బుధవారం వెలుగు చూసింది. ఎస్‌ఐ శివప్రసాద్‌రెడ్డి తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన కుమ్మరి నర్సింహులు (50) వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం పొలం వద్దకు వెళ్లగా గట్టుపై నుంచి జారి బురదలో పడిపోవడంతో నోట్లోకి, ముక్కులోకి బురద చేరిపోయి ఊపిరాడక అక్కడికక్కడే మృతిచెందారు. సాయంత్రం పొలానికి వెళ్లిన అతని తమ్ముడి కూతురు కావ్యశ్రీ గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు వచ్చి చూసేసరికి నర్సింహులు విగతజీవిగా కనిపించాడు. బుధవారం మృతుడి భార్య సుశీల ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహానికి పంచనామా నిర్వహించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నర్సాపూర్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించామని, కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని