logo

పూర్తయ్యేదెన్నడో.. పంపిణీ చేసేదెప్పుడో..?

పేదలకు సొంతింటి కల నెరవేర్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నా క్షేత్ర స్థాయిలో మాత్రం అవి కనిపించడం లేదు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఏళ్ల తరబడి ఇళ్ల నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నా పట్టించుకునే వారే కరవయ్యారని లబ్ధిదారులు వాపోతున్నారు.

Published : 20 Jan 2022 01:40 IST

పైప్‌లైన్‌ ఏర్పాటుకు తవ్వి వదిలేశారిలా..

పేదలకు సొంతింటి కల నెరవేర్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నా క్షేత్ర స్థాయిలో మాత్రం అవి కనిపించడం లేదు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఏళ్ల తరబడి ఇళ్ల నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నా పట్టించుకునే వారే కరవయ్యారని లబ్ధిదారులు వాపోతున్నారు. వెల్దుర్తి మండలం ఉప్పులింగాపూర్‌లో నాలుగేళ్ల క్రితం రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి అధికారులు పనులు చేపట్టినా నేటికీ పూర్తికాలేదు. ఇక్కడ 50 ఇళ్లు మంజూరు కాగా జీ+1 పద్ధతిన ఇళ్లు నిర్మించగా ఇంకా పనులు కొనసాగుతూనే ఉన్నాయి. మురుగు కాలువలు, సీసీ రోడ్లు నిర్మించలేదు. కిటికీలకు అద్దాలు బిగించలేదు. శౌచాలయాల పనులు కూడా అసంపూర్తిగా ఉన్నాయి. మిషన్‌ భగీరథ నీటి సరఫరా పైప్‌లైన్‌ ఏర్పాటుకు కాల్వలు తవ్వి వదిలేశారు. ప్రస్తుతం ఇక్కడ ఎలాంటి పనులు జరగడంలేదు. సంబంధిత అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు. ఈ విషయమై పీఆర్‌ ఏఈ శ్రీనివాస్‌ను ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా.. ప్రతిపాదనలు పంపించామని, నిధులు మంజూరవగానే పనులు ప్రారంభిస్తామన్నారు.

- న్యూస్‌టుడే, వెల్దుర్తి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని