logo

ఘనంగా నాభిశిల వార్షికోత్సవం

గ్రామాల్లో అసంపూర్తిగా ఉన్న ఆలయాల నిర్మాణానికి దాతలు ముందుకు రావాలని రంగంపేట ఆశ్రమ పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామి పిలుపునిచ్చారు.

Published : 20 Jan 2022 01:40 IST

 

పూజలు చేస్తున్న మాధవానంద స్వామి, అర్చకులు

నర్సాపూర్‌ రూరల్‌, న్యూస్‌టుడే: గ్రామాల్లో అసంపూర్తిగా ఉన్న ఆలయాల నిర్మాణానికి దాతలు ముందుకు రావాలని రంగంపేట ఆశ్రమ పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామి పిలుపునిచ్చారు. బుధవారం మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో బొడ్రాయి (నాభిశిల) రెండో వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పాల్గొని బొడ్రాయి వద్ద ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అన్ని ఆలయాల్లో నిత్య పూజలు చేయాలని సూచించారు. పూజారి హరిప్రసాద్‌శర్మ, శ్రీనివాస్‌, నర్సింహులు, కిషన్‌ తదితరులున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని