logo

పురుగు మందు తాగి ఒకరు...

పోలీస్‌ స్టేషన్‌లో తనపై కేసు నమోదైందని మనస్తాపంతో ఓ వ్యక్తి పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్‌ జిల్లా టేక్మాల్‌లో బుధవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ లింగం తెలిపిన వివరాలు.. టేక్మాల్‌ గ్రామానికి చెందిన గడీల యాదయ్య (45) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు

Published : 20 Jan 2022 01:59 IST

టేక్మాల్‌, న్యూస్‌టుడే: పోలీస్‌ స్టేషన్‌లో తనపై కేసు నమోదైందని మనస్తాపంతో ఓ వ్యక్తి పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్‌ జిల్లా టేక్మాల్‌లో బుధవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ లింగం తెలిపిన వివరాలు.. టేక్మాల్‌ గ్రామానికి చెందిన గడీల యాదయ్య (45) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఆయన ఇంటికి సమీపంలో ఉన్న ఓ వ్యక్తితో ఈనెల 16వ తేదీన అతనికి గొడవ జరిగింది. గొడవలో సదరు వ్యక్తికి గాయాలవగా ఆయన వెళ్లి స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు యాదయ్యపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో ఈనెల 17వ తేదీన మెదక్‌ డీఎస్పీ సైదులు, అల్లాదుర్గం సీఐ జార్జి టేక్మాల్‌కు వచ్చి విచారణ చేపట్టారు. విచారణ తర్వత రిమాండ్‌కు తరలిస్తారని మనస్తాపానికి గురయ్యాడని, దీంతో రెండు రోజులుగా యాదయ్య ఇంటి వద్దే దిగాలుగా ఉంటున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా బుధవారం ఉదయం ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన యాదయ్య టేక్మాల్‌ చిన్న చెరువు సమీపంలో పురుగు మందు తాగి అక్కడే పడిపోయాడు. గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి ఫోన్‌ చేసి తాను పురుగు మందు తాగానని తెలపడంతో, వెంటనే అక్కడికి స్థానికులు చేరుకుని చికిత్స నిమిత్తం అతన్ని టేక్మాల్‌ ప్రభుత్వాసుపత్రికి, అక్కడి నుంచి మెదక్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో అక్కడ చికిత్స పొందుతూ యాదయ్య మృతిచెందాడు. మృతుడి కుమారుడు ప్రవీణ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని